DMK Youth Member Arrested | చిన్నారిపై లైంగిక దాడి, హత్య.. డీఎంకే యువజన సభ్యుడు అరెస్ట్
DMK Youth Member Arrested | ఒక చిన్నారి అనారోగ్యంతో మరణించింది. పోస్ట్మార్టం పరీక్షలో లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ బాలిక హత్యకు కారణమైన అధికార డీఎంకే యువజన విభాగం సభ్యుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
చెన్నై: ఒక చిన్నారి అనారోగ్యంతో మరణించింది. పోస్ట్మార్టం పరీక్షలో లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ బాలిక హత్యకు కారణమైన అధికార డీఎంకే యువజన విభాగం సభ్యుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. (DMK Youth Member Arrested) తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భర్త నుంచి విడిపోయిన మహిళతో అధికార పార్టీ డీఎంకే యువజన విభాగం సభ్యుడు పెరియనాయగం సహజీవనం చేస్తున్నాడు. గత ఏడాది డిసెంబర్లో రెండున్నర ఏళ్ల వయస్సున్న ఆమె కుమార్తె తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆసుపత్రికి తరలించగా ఆ బాలిక మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
కాగా, ఆ చిన్నారి మరణంపై ఆమె తండ్రి అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బాలిక మరణంపై దర్యాప్తు జరిపారు. చిన్నారి మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించగా అంతర్గత గాయాలున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఆ చిన్నారిపై లైంగిక దాడి జరిపి హత్య చేశారన్న అనుమానాలు బలపడ్డాయి. అయితే ఫోరెన్సిక్ తుది నివేదిక కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు.
మరోవైపు ఈ సంఘటన తమిళనాడు రాజకీయాల్లో దుమారం రేపింది. మహిళలు, పిల్లలపై నేరాలను అరికట్టడంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నట్లు డీఎంకే ఎదురుదాడి చేసింది.
కాగా, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార డీఎంకే యువజన విభాగం సభ్యుడైన పెరియనాయగంను పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టంతో పాటు హత్య సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నట్లు వివరించారు.
Also Read:
IAS Officer Suspended | మంత్రి సమావేశాలకు గైర్హాజరు.. ఐఏఎస్ అధికారి సస్పెండ్
Couple’s Marriage Lasted Few Hours | పెళ్లైన కొన్ని గంటల్లోనే విడిపోయిన జంట.. ఎందుకంటే?
Watch: బావిలో పడిన మేక పిల్ల.. కాపాడేందుకు సాహసం చేసిన బాలుడు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- arrested
- DMK
- Girl
- Rape and murder
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

