SIR Officials Attacked | పొరపాటున ఒడిశా చేరుకున్న బెంగాల్ ‘సర్’ అధికారులు.. చితక్కొట్టిన గ్రామస్తులు
SIR Officials Attacked | ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ నిర్వహించే పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు ఎన్నికల అధికారులు పొరపాటున తమ వాహనంలో ఒడిశాలోకి ప్రవేశించారు. అయితే పిల్లల దొంగలుగా అనుమానించిన గ్రామస్తులు వారిని చితక్కొట్టారు.
భువనేశ్వర్: ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ నిర్వహించే పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు ఎన్నికల అధికారులు పొరపాటున తమ వాహనంలో ఒడిశాలోకి ప్రవేశించారు. అయితే పిల్లల దొంగలుగా అనుమానించిన గ్రామస్తులు వారిని చితక్కొట్టారు. (SIR Officials Attacked) ఈ నేపథ్యంలో 72 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పశ్చిమ బెంగాల్‌లోని నయాగ్రామ్ వైపు వాహనంలో వెళ్తున్న ఇద్దరు ‘సర్’ అధికారులు పొరపాటున ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోకి ప్రవేశించారు.
కాగా, పిల్లలను కిడ్నాప్ చేసే వారిగా ఆ జిల్లాలోని గ్రామస్తులు అనుమానించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులను నిర్బంధించారు. వారిపై గుంపుగా దాడి చేసి కొట్టారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ గ్రామానికి చేరుకున్నారు. ఎన్నికల అధికారులను విడిపించి కాపాడారు.
మరోవైపు ఈ సంఘటనపై రెండు వేర్వేరు కేసులను పోలీసులు నమోదు చేశారు. 20 మంది మహిళలతో సహా 72 మందిని అరెస్ట్ చేశారు. అయితే వ్యక్తులపై అనుమానం కలిగితే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీస్ అధికారి సూచించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరించారు.
Also Read:
Nepali Woman Gang Raped | ఆటోలో వెళ్తున్న నేపాల్ మహిళ.. డ్రైవర్‌తో సహా ముగ్గురు సామూహిక అత్యాచారం
Police Trainees Reel | రీల్ తెచ్చిన చిక్కులు.. ఆరుగురు ట్రైనీ పోలీసులకు షోకాజ్ నోటీసులు
Anna Hazare | లిక్కర్ పాలసీపై కోర్టు తీర్పును అంగీకరించాలి: అన్నా హజారే
Watch: బావిలో పడిన మేక పిల్ల.. కాపాడేందుకు సాహసం చేసిన బాలుడు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- arrested
- Mistakenly
- Odisha
- reach
RELATED ARTICLES
తాజా వార్తలు
SI Lingam | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు : ఎస్సై లింగం
Mental Health | మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 5 పోషక లోపాలు.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
‘బీసీ ఉద్యమ నేత గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి’
CJP protest | సీజేపీ నిరసన.. రాత్రి నుంచి సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్
Navaratri Brahmotsavams | నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలి : టీటీడీ అదనపు ఈవో
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

