ముంబై: లిక్కర్ పాలసీపై ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పును అంగీకరించాలని సామాజిక కార్యకర్త అన్నా హజారే అన్నారు. (Anna Hazare) అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై ఆయన స్పందించారు. న్యాయవ్యవస్థ దేశానికి వెన్నెముక లాంటిదని, దాని నిర్ణయాలను గౌరవించాలని స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రి సిసోడియాతో పాటు 23 మందిని నిర్దోషులుగా రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం ప్రకటించింది. మద్యం విధానాన్ని రూపొందించే క్రమంలో అవినీతి జరిగినట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని పేర్కొంది.
కాగా, అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ ఎదుగుదలకు ముఖ్యులైన అన్నా హజారే దీనిపై స్పందించారు. న్యాయ, భద్రతా వ్యవస్థల బలం మీద మన దేశం నడుస్తుందని తెలిపారు. విభిన్న పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలతో కూడిన పెద్ద దేశం అయినప్పటికీ, న్యాయవ్యవస్థ కారణంగా అది సజావుగా పనిచేస్తున్నదని చెప్పారు. న్యాయవ్యవస్థ లేకపోతే గందరగోళం, అశాంతి ఏర్పడుతుందని తెలిపారు. ‘అరవింద్ కేజ్రీవాల్ తప్పు చేయలేదని పేర్కొంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. దానిని అంగీకరించాలి’ అని మీడియాతో అన్నారు.
VIDEO | As the Rouse Avenue Court discharges former Delhi CM Arvind Kejriwal and his deputy Manish Sisodia in the excise policy case, social activist Anna Hazare says, “Our country runs on the strength of its judicial and security systems. Despite being such a large nation with… pic.twitter.com/xpBCMf7s7m
— Press Trust of India (@PTI_News) February 27, 2026
Also Read:
Kolkata Earthquake | కోల్‌కతాలో భారీ భూకంపం.. భయంతో ఇళ్లను వీడిన జనం
Couple’s Marriage Lasted Few Hours | పెళ్లైన కొన్ని గంటల్లోనే విడిపోయిన జంట.. ఎందుకంటే?
Students Chain Snatching | మహిళ మెడలోని బంగారు గొలుసు చోరీ.. మెడికల్ కాలేజీ విద్యార్థులు అరెస్ట్
Watch: బావిలో పడిన మేక పిల్ల.. కాపాడేందుకు సాహసం చేసిన బాలుడు