Emergency Exit: విమానం ల్యాండ్ అవుతున్న వేళ.. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నం
Emergency Exit: విమానంలో గాలిలో ఉండగానే ఓ ప్రయాణికుడు ఎగ్జిట్ డోర్ తెరిచే ప్రయత్నం చేశాడు. కౌలాలంపూర్ నుంచి కొచ్చిన్ వస్తున్న బాతిక్ ఎయిర్ ఫ్లయిట్‌కు చెందిన విమానంలో ఈ ఘటన జరిగింది. 34 ఏళ్ల నిందితుడు జమ్షీర్ అత్తనిక్కల్ను కస్టడీలోకి తీసుకున్నారు.
తిరువనంతపురం: కౌలాలంపూర్ నుంచి కొచ్చిన్ వస్తున్న విమానంలో.. ఓ ప్రయాణికుడు ఎగ్జిట్ డోర్(Emergency Exit) తెరిచే ప్రయత్నం చేశాడు. బాతిక్ ఎయిర్ ఫ్లయిట్‌కు చెందిన విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు చెందిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. విమానం గాలిలో ఉండగానే ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన వ్యక్తిని 34 ఏళ్ల జమ్షీర్ అత్తనిక్కల్గా గుర్తించారు. అతని స్వస్థలం పాలక్కాడ్ జిల్లాలోని కూతనాడ్. పోలీసులు ఈ ఘటనకు చెందిన వివరాలను వెల్లడించారు.
కొచ్చిలో దిగేందుకు విమానం ప్రయత్నిస్తున్న సమయంలో.. అత్తనిక్కల్ సడెన్‌గా తన సీటు నుంచి లేచి ఎమర్జెన్సీ ఎగ్జిట్ కిటికీ తెరిచేందుకు ప్రయత్నించాడు. అతన్ని ఆపేందుకు ప్రయత్నించిన విమాన సిబ్బందితో పాటు ప్రయాణికులను బెదిరించాడు. కానీ ప్రయాణికులు, సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కొచ్చిన్ విమానాశ్రయంలో రాత్రి 11.30 నిమిషాలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఫిర్యాదు నేపథ్యంలో బాతిక్ ఎయిర్ సెక్యూర్టీ బృందం, సీఐఎస్ఎఫ్ సిబ్బంది అతన్ని కస్టడీలోకి తీసుకున్నది.
ఆ వ్యక్తిని స్థానిక పోలీసులకు అప్పగించారు. విమానాన్ని డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో అతని పై కేసు నమోదు చేశారు. నేరపూరిత బెదిరింపు కింద కూడా కేసు బుక్ చేశారు. బీఎన్ఎస్ 351(3), ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్ 11-ఏ, కేరళ పోలీసు యాక్ట్ 118(ఈ) ప్రకారం కేసులు నమోదు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

