శాలిగౌరారం : తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా శాలిగౌరారం మండల వ్యాప్తంగా మంచినీటి ఎద్దడి తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులఫై ఉందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్త్రీ శక్తి భవనంలో గ్రామ పంచాయతీల అభివృద్ధిఫై మండల ప్రజా పరిషత్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, వెంటనే మారమ్మతులు చేపట్టాలని కోరగా చర్యలు చేపడుతామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాదూరి శంకర్ రెడ్డి, ఎంపీడీఓ రజిత, తాసీల్దార్ మాధవరావు, అధికారులు పాల్గొన్నారు.