గ్యాంగ్టక్: సిక్కిం(Sikkim) రాష్ట్రంలో భీకరంగా వర్షాలు కురిశాయి. దీంతో గల్సింగ్ జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ మట్టిచరియల్లో అనేక ఇండ్లు ధ్వంసం అయ్యాయి. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఆ విపత్తు వల్ల రింబి గ్రామంలో భారీగా నష్టం సంభవించింది. ఇండ్లతో పాటు ప్రభుత్వ అకామిడేషన్స్ కూడా ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. కానీ ఎటువంటి ప్రాణ నష్టం జరిగలేదని అధికారులు చెప్పారు. రింబిలో ఉన్న పరిస్థితి పట్ల సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభావిత వ్యక్తుల భద్రత, క్షేమం ప్రభుత్వ ప్రాధాన్యత అవుతుందని సీఎం ప్రేమ్ సింగ్ తెలిపారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని ఆయన తన ఆదేశాల్లో పేర్కొన్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు చెప్పారు. ఏకధాటిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభావిత ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ప్రభుత్వ సూచనలు ఫాలోకావాలన్నారు.
#WATCH | Sikkim | A major landslide in the Rimbi area has left more than 30 houses affected. The incident was triggered by heavy mudslides and debris coming down from the upper slopes, sending large quantities of mud, rocks and other debris towards the lower areas
(Video source:… pic.twitter.com/5rhBlSoiTB
— ANI (@ANI) September 25, 2026