న్యూఢిల్లీ: బీహార్(Bihar)లోని మందార పర్వతంపై.. ఓ మహిళను ఆకతాయిలు వేధించారు. బంకా జిల్లాలో ఉన్న ప్రఖ్యాత టూరిస్టు సైట్ వద్ద ఈ ఘటన జరిగింది. ఆరుగురు యువకులపై కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 3వ తేదీన ఓ అమ్మాయిని వేధించినట్లు వీడియో ద్వారా తెలిసింది. ఆ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఆ గ్యాంగ్.. ఆమెను చెప్పుతో కొట్టారు. అయితే ఈ ఘటనకు చెందిన వీడియో సెప్టెంబర్ 22వ తేదీన పోలీసులకు చిక్కింది. సోషల్ మీడియా సెల్ ద్వారా ఆ వీడియో గురించి తెలుసుకున్నారు.
బౌన్సీ పోలీసు స్టేషన్ పరిధిలో కేసు బుక్ చేసి దర్యాప్తు చేపట్టారు. బౌన్సీ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ పంకజ్ కుమార్ జా వాట్సాప్ నెంబర్కు వీడియో ఫార్వర్డ్ అయ్యింది. అయితే ఘటన జరిగిన ప్రదేశాన్ని ఎస్హెచ్వో విజిట్ చేశారు. అసభ్య ప్రవర్తన కింద ఆరుగుర్ని అనుమానిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. వీడియోలో ఉన్న మహిళ, అబ్బాయి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. మందార హిల్ సమీపంలో గాలింపు ముమ్మరం చేశారు.
నిందితులను పట్టుకున్న తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఇటీవల బీహార్లో రెండు వేధింపుల ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. జాముయి, సమస్తిపుర్లో కూడా అమ్మాయిని ఆకతాయిలు వేధించిన విషయం తెలిసిందే.
🚨SHOCKING
Banka, Bihar – A video allegedly showing a young woman and a man being subjected to inappropriate behaviour and harassment at the Mandar tourist site in Banka district has surfaced on social media, the woman and the man had reportedly visited Mandar Hill when the… pic.twitter.com/xTqRWOtuDI
— Amitabh Chaudhary (@MithilaWaaala) September 25, 2026