Road acccident | ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తాడ్వాయి–పస్రా మధ్య బస్సు, బొలెరో వాహనం ఢీకొనడంతో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వరంగల్ నుంచి గుంటూరు వెళ్తున్న బస్సును భద్రాచలం నుంచి మల్లంపల్లి రామచంద్రపుర్ వెళ్తున్న బొలెరో వాహనం ఎదురుగా వచ్చి ఢీకొట్టింది.
ప్రమాదంలో 15 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 అంబులెన్స్‌ల ద్వారా ములుగు దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.