చదువులపై వ్యయం 5.98 శాతమే!
‘విద్య మాకు అత్యంత ప్రాధాన్యత రంగం.. విద్యాశాఖను నా దగ్గరే ఉంచుకుంటా. నేనే సమస్యలను పరిష్కరిస్తాం. విద్యకు బడ్జెట్లో 9.8 శాతం కేటాయించాం
- విద్యారంగంపై సర్కార్ చిన్నచూపు
- 2024-25లో భారీగా తగ్గిన వ్యయం
- సీఎం మాటలకు.. చేతలకు కుదరని పొంతన
- బీఆర్ఎస్ హయాంలో విద్యపై ఏటా 8 శాతం ఖర్చు
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): ‘విద్య మాకు అత్యంత ప్రాధాన్యత రంగం.. విద్యాశాఖను నా దగ్గరే ఉంచుకుంటా. నేనే సమస్యలను పరిష్కరిస్తాం. విద్యకు బడ్జెట్లో 9.8 శాతం కేటాయించాం. రాబోయే రోజుల్లో పెంచుతాం.’
ఇదీ తరుచూ సీఎం, విద్యాశాఖ మంత్రి రేవంత్‌రెడ్డి చెప్పే మాట. అయితే ఇది మాటలకే పరిమితమని, ఆచరణలో కనిపించడం లేదని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024-25 సంవత్సరంలో చదువులపై సర్కార్ కేవలం 5.98 శాతం మాత్రమే ఖర్చుచేసింది. రాష్ట్ర చరిత్రలో ఇదే కనిష్ఠం కావడం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ గణాంకాలు ఆందోళన కలిగించే ఈ విషయాన్ని బహిర్గతం చేశాయి. పరిస్థితి చూస్తుంటే రాష్ట్రంలో బడ్జెట్ కేటాయింపులు ఘనం.. చేస్తున్న వ్యయం ఘోరంగా ఉన్నట్టు స్పష్టమవుతున్నది. 2018-19లో రాష్ట్రం ప్రభుత్వం విద్యపై 8.7 శాతం ఖర్చు చేయగా 2024 -25లో 5.98 శాతానికే పరిమితమమయ్యింది. అంటే విద్యపై వెచ్చింపులు ఉత్తుత్తిమాటలేనని తేలిపోయింది. బీఆర్ఎస్ పాలనలో విద్యారంగంపై ఖర్చు సగటున 8 శాతం ఉండటం విశేషం.
బీహార్.. బెటర్!
విద్యపై ఖర్చుచేస్తున్న రాష్ర్టాలను పరిశీలిస్తే బీహార్ రాష్ట్రం మనకంటే అత్యుత్తమ స్థానంలో ఉంది. 2024-25 సంవత్సరంలో బీహార్ 20.27 శాతం, ఢిల్లీ 24.26 శాతం, హిమాచల్ ప్రదేశ్ 12.65 శాతం, ఉత్తరాఖండ్ 12.52 శాతం, రాజస్థాన్ 12.11 శాతంతో విద్యపై గణనీయంగా ఖర్చుచేసినట్టు ఆర్బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దక్షిణాది రాష్ర్టాలైన ఏపీ, కర్ణాటకతో పోల్చినా తెలంగాణ వ్యయం తక్కువగానే ఉన్నది. రాష్ట్రంలో విద్యాశాఖను స్వయంగా ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న నేపథ్యంలో విద్యపై వ్యయం భారీగా తగ్గడం ఆశ్చర్యపరుస్తున్నది.
15 శాతం ఖర్చు చేస్తామని..
రాష్ట్ర బడ్జెట్లో విద్యకు 15 శాతం నిధులు కేటాయించి, ఖర్చు చేస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హామీనిచ్చింది. అంటే ఈ లెక్కన ఏటా రూ. 40 వేల కోట్లు ఖర్చుచేయాలి. కానీ ఆర్థిక సంవత్సరంలో కేవలం 9 శాతం మాత్రమే కేటాయించింది. ఆ మొత్తం కూడా ఖర్చు చేయలేదు. విద్యారంగానికి నిధుల కొరత నేపథ్యంలో తెలంగాణ విద్యాకమిషన్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. 18 శాతం నిధులు కేటాయించాలని సర్కార్‌కు సిఫార్సు చేసింది. రాష్ట్రంలో విద్యారంగం దుస్థితిలో ఉన్నదని, అభ్యాస పేదరికం(లెర్నింగ్ పావర్టీ) ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేసింది. విద్యారంగ స్థితిపై ప్రజలు, పౌర సమాజంలో అశాంతి పెరుగుతున్నదని, ఆయావర్గాల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్నదని, బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపులు పెంచాలని సర్కార్‌ను కోరింది.
రాష్ట్రంలో విద్యపై వ్యయం
ఆర్థిక సంవత్సరం విద్యపై వ్యయం
- 2018-19 = 8.7
- 2019-20 = 8.8
- 2020-21 = 8.1
- 2021-22 = 7.9
- 2022-23 = 8.7
- 2023-24 = 8.5
- 2024-25 = 5.98
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

