పౌర హక్కులపై అవగాహన కలిగి ఉండాలి : సర్పంచ్ శ్యామల
పౌర హక్కులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామలా శేఖర్ అన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో శనివారం రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవాన్ని పురష్కరించుకుని..
కట్టంగూర్, ఫిబ్రవరి 28 : పౌర హక్కులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామలా శేఖర్ అన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో శనివారం రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవాన్ని పురష్కరించుకుని గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కల్పించే చట్టాలున్నాయని, వాటి గురించి అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరమన్నారు. బాల్య వివాహాలు సమాజానికి ముప్పని, చిన్నారుల భవిష్యత్ ను నాశనం చేసే దురాచారాన్ని పూర్తిగా నిర్మూలించాలన్నారు. పౌర హక్కులకు భంగం కలిగించడం నేరమని ప్రతి ఒక్కరు ఇతరుల హక్కులలో జోక్యం చేసుకోవద్దన్నారు. కాలనీలో తాగునీరు. రహదారులు, విద్యుత్ సంక్షేమ పథకాల అమలు వంటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ కార్యాలయ జూనియర్ సహాయకులు భాగ్యలక్ష్మి, జీపీఓ అల్లావుద్దీన్, వార్డు సభ్యులు మైనం ఉమా అంబేద్కర్, కాలనీ వాసులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

