రుద్రంపూర్, ఫిబ్రవరి 28 : నేడు ప్రపంచం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఊహించని ప్రగతి సాధించిందని, సాధించిన ప్రగతిని అభివృద్ధి కంటే వినాశనానికే ఎక్కువగా ఉపయోగించడం దురదృష్టం అని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేఖ్ అబ్దుల్ బాసిత్ అన్నారు. శనివారం రామవరం మోడ్రన్ ఇఖ్రా స్కూల్ లో జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించారు. ప్రముఖ శాస్త్రవేత్త సర్ సి.వి రామన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుద్ధ వినాశం కోసం కాకుండా మానవ ప్రగతికి సైన్స్ వినియోగించాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు సైన్స్ మానవ సమాజానికి చేస్తున్న మేలు గురించి వివరించారు. శాస్త్ర సాంకేతిక రంగంలో భారతీయ శాస్త్రవేత్తలు సర్ సీవీ రామన్, ఏపీజే అబ్దుల్ కలాం, సుభాష్ చంద్రబోస్, మేరీ విలియం చేసిన సేవలను కొనియాడారు. వారి బాటలో నడిచి దేశాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని విద్యార్థులు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం పర్వీన్ సుల్తానా, టీచర్లు నీలా, శిరీషా, సరస్వతి, ప్రసన్న, విజయలక్ష్మీ, సల్మా, జేఫీషా, అనితా పాల్గొన్నారు.