Bangladesh : బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్దీన్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య సమస్యలతోనే ఆయన రాజీనామా చేసినట్లు అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. బంగ్లాదేశ్‌లో అధ్యక్ష పదవికి నామమాత్రపు అధికారాలే ఉంటాయి. ప్రస్తుతం 76 ఏళ్ల వయసున్న షహబుద్దీన్ ఏప్రిల్ 2023 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. అక్కడ అధ్యక్షుడి పదవీ కాలం ఐదేళ్లు.
అంటే ఆయనకు 2028, ఏప్రిల్ వరకు పదవిలో కొనసాగే అవకాశం ఉంది. తన రాజీనామా గురించి షహబుద్దీన్ కూడా కీలక వివరాలు వెల్లడించారు. ఇటీవల తనకు అటానామిక్ న్యూరోపతి సమస్య తలెత్తిందని, దీనివల్ల జ్ఞాపకశక్తి కోల్పోతున్నానని చెప్పాడు. అందువల్లే ఆయన రాజీనామా చేసినట్లు తేలింది. ఈ మేరకు పార్లమెంట్ స్పీకర్‌కు ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. షహబుద్దీన్ హయాంలోనే బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. ప్రధాని షేక్ హసీనాపై తిరుగుబాటు, ఆమె దేశం విడిచి ఇండియా రావడం 2024లో షహబుద్దీన్ హయాంలోనే జరిగాయి. తిరుగుబాటు అనంతరం ఈ ఏడాది ప్రారంభంలో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు కూడా జరిగాయి. అనంతరం ప్రధానిని ఎన్నుకున్నారు.
𝐁𝐚𝐧𝐠𝐥𝐚𝐝𝐞𝐬𝐡 𝐏𝐫𝐞𝐬𝐢𝐝𝐞𝐧𝐭 𝐑𝐞𝐬𝐢𝐠𝐧𝐬 𝐌𝐢𝐝𝐰𝐚𝐲 𝐓𝐡𝐫𝐨𝐮𝐠𝐡 𝐓𝐞𝐫𝐦
President Mohammed Shahabuddin resigned today (24th July, 2026), submitting a letter to the Speaker of parliament under Article 50(3) of the Constitution, roughly halfway through a term… pic.twitter.com/4z5JyTBY0i
— Sami (@ZulkarnainSaer) July 24, 2026
షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయాక యూనస్ ఆధ్వర్యంలోని తాత్కాలిక ప్రభుత్వం తనను అనేక ఇబ్బందులకు గురి చేసిందన్నాడు. తనకు యూనస్ ప్రభుత్వం సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తన పదవికి రాజీనామా చేస్తానని గతంలోనే ప్రకటించారు. ప్రస్తుతం షహబుద్దీన్ రాజీనామా చేయడంతో పార్లమెంట్ స్పీకర్ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.