Minister Resigned : జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఆందోళనల నడుమ కేంద్రమంత్రి హఠాత్తుగా రాజీనామా చేశారు. నీట్ (NEET) పరీక్ష లీకేజీకి బాధ్యతగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్లతో ఢిల్లీ అట్టుడుకుతున్న వేళ.. రైల్వే సహాయక మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు (Ravneet Singh Bittu) పదవి నుంచి వైదొలిగారు. శుక్రవారం ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన రాజీనామాను సమర్పించారు. ముర్ము వెంటనే రిజైన్ లెటర్‌ను ఆమోదించారు. అసలు కారణమేంటో తెలుసా..?
ఢిల్లీలో విద్యార్థులు, ప్రతిపక్షాల నిరసనలు, ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగానే రైల్వే సహాయక మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు రాజీనామా చేశారు. భారత రాజ్యాంగంలోని క్లాస్ 2 ఆర్టికల్ 75 ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ సూచన మేరకు రాజీనామా చేశారని రాష్ట్రపతి భవన్ వెల్లడించింది.
I express my heartfelt gratitude to Hon’ble President Smt. Droupadi Murmu Ji and Hon’ble Prime Minister Shri @narendramodi Ji for giving me the opportunity to serve the nation as Minister of State in the Government of India.
It has been an honour to serve the people of India,…— Ravneet Singh Bittu (@RavneetBittu) July 24, 2026
రాజ్య సభ సభ్యుడిగా రవ్నీట్ పదవీకాలం జూన్ 21న ముగియడమే అందుకు కారణం. రాజస్థాన్ నుంచి 2021 ఆగస్టు నుంచి ఎగువ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన తన పదవీకాలం ముగియడంతో రాజీనామా చేశారు. పంజాబ్‌కు చెందిన రవ్నీట్ .. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
‘భారత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసే అవకాశం కల్పించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. దేశ ప్రజలకు, ముఖ్యంగా పంజాబ్‌కు సేవ చేయడం నాకు దక్కిన గౌరవం. నేను ఇప్పటికీ సేవ, జాతీయభావం వంటి విలువులకు, ప్రధాని మోడీ నాయకత్వంలో రూపుదిద్దుకున్న వికసిత్ భారత్‌కు నేను కట్టుబడి ఉన్నాను. ప్రజా సేవలో ఇకపై కూడా అంకితభావంతో పనిచేస్తాను’ అని రవ్నీత్ సింగ్ బిట్టు ఎక్స్ పోస్ట్‌లో వెల్లడించారు.
President Droupadi Murmu, as advised by the Prime Minister, has accepted the resignation of Ravneet Singh from the Union Council of Ministers, with immediate effect
(File pic of Ravneet Singh) pic.twitter.com/YuqroBzOi9
— ANI (@ANI) July 24, 2026