Thieves | యాదాద్రి భువనగిరి జిల్లాలో దోపిడీ దొంగలు హల్ చల్ చేశారు. జిల్లాలోని చౌటుప్పల్ దర్బార్ బార్లోకి చొరబడ్డ దొంగలు భారీ మొత్తంలో నగదు ఎత్తుకెళ్లారు. దొంగలు అర్ధరాత్రి సమయంలో బార్లోకి దూరి రూ.4 లక్షలు చోరీ చేసినట్టు బార్ నిర్వాహకులు తెలిపారు.
బార్ మెయిన్ గేటు తాళాన్ని విరగ్గొట్టిన దొంగలు బార్లోని రూంలో ఉన్న బీరువా తాళాలు పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లినట్టు వీడియో ద్వారా అర్థమవుతోంది. నిర్వహకుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ దర్బార్ బార్లో చోరీ
అర్ధరాత్రి సమయంలో బార్లో దూరి రూ.4 లక్షలు చోరీ చేసిన దొంగలు pic.twitter.com/FegH7cDR1O
— Telugu Scribe (@TeluguScribe) September 23, 2026