Salakatla Brahmotsavams | పుష్కరిణిలో చక్రస్నానంతో ముగిసిన తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు
Salakatla Brahmotsavams | తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. తొమ్మిదిరోజుల బ్రహ్మోత్సవాలకు ముగింపుగా చివరి రోజున బుధవారం శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
తిరుమల : తిరుమల ( Tirumala ) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ( Salakatla Brahmotsavams ) వైభవంగా ముగిశాయి. తొమ్మిదిరోజుల బ్రహ్మోత్సవాలకు ముగింపుగా చివరి రోజున బుధవారం శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం ( Chakra Snanam ) అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.




తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య భూవరాహస్వామివారి ఆలయ ముఖమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు.
విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ముఖప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్రచామరాది రాజోపచారాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణల ద్వారా అభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు డా. ఎ. శరత్, ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో కే.వి. మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ సీఈ మనోహరం, ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్, శ్రీవారి సేవకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

