కొత్తగూడెం టౌన్, జూలై 24 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పుట్టిన రోజును కొత్తగూడెంలో ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని, శుక్రవారం సుజాత నగర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లును బీఆర్ఎస్ నాయకులు పంపిణీ చేశారు.
బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జికి నిరసనగా పుట్టిన రోజు వేడుకలు జరపొద్దు అని కేటీఆర్ పిలుపునిచ్చారు. అందుకని ఆయన 50వ పుట్టినరోజు వేడుకలను ఎలాంటి హాంగూఆర్భాటాలు లేకుండా జరిపాం. నిరుద్యోగులు, విద్యార్థుల పైన కేంద్ర ప్రభుత్వం చేసే అన్యాయపు దాడులకు నిరసన తెలియచేస్తూ విద్యార్థులకు కేటీఆర్ పూర్తి మద్దతు ప్రకటించారు.
ఒక నాయకుడికి ఉండే గొప్ప లక్షణం ఇది అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సుజాతనగర్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లావుడియా సత్యనారాయణ, చింతలపూడి జగన్, పెద్దమల్ల నరేంద్ర, కార్తీక్, కృష్ణ, చంటి, ప్రదీప్, బాబా, రహీం, సాజిద్,రాజేష్, ఇర్ఫాన్, తదితరులు పాల్గొన్నారు.