Andy Jassy | ఏఐతో ఉద్యోగాలు పోవు.. వాటి స్వరూపం మారుతుందంతే : అమెజాన్ సీఈవో
Andy Jassy | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) వల్ల భారీ సంఖ్యలో ఉద్యోగాలు పోతాయనే భయాలు అతిశయోక్తి కావచ్చునని, అమెజాన్ సీఈవో (Amazon CEO) ఆండీ జెస్సీ (Andy Jassy) అభిప్రాయపడ్డారు. ఉద్యోగ అవకాశాలను పూర్తిగా తొలగించడం కంటే, పని స్వభావాన్ని ఏఐ పునర్నిర్మించే అవకాశం ఎక్కువగా ఉందన్నారు.
Andy Jassy : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) వల్ల భారీ సంఖ్యలో ఉద్యోగాలు పోతాయనే భయాలు అతిశయోక్తి కావచ్చునని, అమెజాన్ సీఈవో (Amazon CEO) ఆండీ జెస్సీ (Andy Jassy) అభిప్రాయపడ్డారు. ఉద్యోగ అవకాశాలను పూర్తిగా తొలగించడం కంటే, పని స్వభావాన్ని ఏఐ పునర్నిర్మించే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. గత రెండు మూడు దశాబ్దాలుగా మానవ శ్రమపై ఎక్కువగా ఆధారపడిన అనేక పనులకు భవిష్యత్తులో తక్కువమంది అవసరమవుతారని జెస్సీ అంగీకరించారు.
అయితే దీనివల్ల ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగవుతాయని అర్థం కాదన్నారు. గత 20-30 ఏళ్లుగా మనం మానవ శ్రమతో చేస్తున్న చాలా పనులకు భవిష్యత్తులో అంతమంది అవసరం ఉండకపోవచ్చునని తాను నమ్ముతున్నానని చెప్పారు. కానీ అదే సమయంలో కొత్త ఉద్యోగాలు కూడా సృష్టించబడతాయని తెలిపారు. ప్రతి సాంకేతిక మార్పు జరిగినప్పుడు ఇలాగే జరిగిందని ఆయన వివరించారు.
కాగా ఏఐ ఉద్యోగాలను నాశనం చేయదని, వాటి స్వరూపాన్ని మాత్రమే మారుస్తుందని పలు నివేదికలు కూడా సూచిస్తున్నాయి. ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ ఇటీవల విడుదల చేసిన నివేదికలో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. ‘కొన్ని పనులు ఆటోమేట్ అయినప్పటికీ చాలా మంది ఉద్యోగులు శాశ్వతంగా ఉపాధి కోల్పోయే అవకాశం లేదు. బదులుగా చాలా మంది ఇంకా ఉనికిలో లేని పాత్రలతో సహా కొత్త రకాల ఉద్యోగాలకు మారతారని అంచనా వేస్తున్నాం’ అని ఆ నివేదిక పేర్కొన్నది.
తన వాదనకు మద్దతుగా గత 150 ఏళ్లలో విద్యుత్, యాంత్రీకరించిన వ్యవసాయం, కంప్యూటర్లు, ఇంటర్నెట్ లాంటి ప్రధాన సాంకేతిక మార్పులను మోర్గాన్ స్టాన్లీ ఉదహరించింది. ఈ ఆవిష్కరణలు పరిశ్రమలను మార్చాయి కానీ మానవ శ్రమను పూర్తిగా భర్తీ చేయలేదని గుర్తుచేసింది. 1980లలో స్ప్రెడ్షీట్ల రాకను దీనికి మంచి ఉదాహరణగా పేర్కొంది. స్ప్రెడ్షీట్లు కొన్ని క్లరికల్ పనుల అవసరాన్ని తగ్గించినా, ఆర్థిక నిపుణులు మరింత సంక్లిష్టమైన, అధిక విలువైన పనులపై దృష్టి పెట్టేందుకు వీలు కల్పించాయని, ఇది ఆర్థిక రంగంలో కొత్త కెరీర్లను సృష్టించడానికి దారితీసిందని తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

