బస్‌పాస్ పోతే మళ్లీ డబ్బులే!
బస్‌పాస్ కోల్పోయిన వ్యక్తి మళ్లీ బస్సు పాస్ పొందాలంటే కొత్త బస్సు పాస్ తీసుకోవాల్సిందేనని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. పాస్ దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ సేవ అందుబాటులో ఉన్నప్పటికీ పోగొట్టుకున్న బస్సు పాస్ వివరాలు మాత్రం ఆర్టీసీ వద్ద ఉండవనడంపై పాస్ హోల్డర్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల రాజు అనే బస్‌పాస్ హోల్డర్ తన బస్సు పాస్‌ను పోగొట్టుకున్నాడు. అతడు ఆర్టీసీ అధికారులను సంప్రదిస్తే మళ్లీ కొత్త బస్‌పాస్ తీసుకోవాల్సిందేనని చెప్పారు.
- నంబర్ చెబితే మరో పాస్ ఇవ్వని వైనం
సిటీబ్యూరో: బస్‌పాస్ కోల్పోయిన వ్యక్తి మళ్లీ బస్సు పాస్ పొందాలంటే కొత్త బస్సు పాస్ తీసుకోవాల్సిందేనని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. పాస్ దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ సేవ అందుబాటులో ఉన్నప్పటికీ పోగొట్టుకున్న బస్సు పాస్ వివరాలు మాత్రం ఆర్టీసీ వద్ద ఉండవనడంపై పాస్ హోల్డర్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల రాజు అనే బస్‌పాస్ హోల్డర్ తన బస్సు పాస్‌ను పోగొట్టుకున్నాడు. అతడు ఆర్టీసీ అధికారులను సంప్రదిస్తే మళ్లీ కొత్త బస్‌పాస్ తీసుకోవాల్సిందేనని చెప్పారు. అదేంటీ ఇప్పటికే పాస్ తీసుకున్నానని, ఐడీ కార్డు చూపించి పాస్ నంబర్ చెబితే మరొకటి జారీ చేయరా అంటూ ప్రశ్నించారు.
అలాంటి సాంకేతిక వ్యవస్థ రాలేదని అధికారులు సమాధానం చెప్పడంతో మళ్లీ రూ.1630 చెల్లించి నెలవారీ బస్‌పాస్ తీసుకున్నాడు. అయితే పోగొట్టుకున్న బస్సు పాస్‌ను తిరిగి పొందేలా ఆన్లైన్లో అందుబాటులో ఉండాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, పాన్ కార్డు, ఆర్సీ, లైసెన్స్ తదితర విలువైన వాటికి ఆన్లైన్లో పొందే అవకాశం ఉందని, డూప్లికేట్ బస్సు పాస్ మాత్రం ఆర్టీసీ ఆన్లైన్ సేవల్లో అందుబాటులో ఎందుకు ఉంచడం లేదని ప్రశ్నిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బస్‌పాస్ పోతే మళ్లీ డబ్బులే!
బీఎస్సీ ఉద్యాన కోర్సులో ప్రవేశాలకు 30న చివరి విడత కౌన్సెలింగ్
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

