న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఒక ఇంటిపై రైడ్ చేశారు. కుప్పలుగా ఉన్న కోట్లాది డబ్బు, సూట్‌కేస్ నిండా ఉన్న కోట్ల విలువైన బంగారం, వజ్రాలు చూసి షాకయ్యారు. (Cash, Suitcase With Gold, Diamonds) వీటితో పాటు బ్యాగు నిండా ఉన్న రూ.35 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు, బ్యాంకుల చెక్‌బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు. లగ్జరీ కార్లు, ప్రైవేట్ జెట్లతో తన సంపన్న జీవనశైలిని సోషల్ మీడియాలో ప్రదర్శించే రావు ఇంద్రజీత్ సింగ్ యాదవ్‌పై ఈడీ, హర్యానా పోలీసులు నిఘా పెట్టారు. ఆయన అక్రమాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ, గురుగ్రామ్, రోహ్తక్లోని పలు ప్రాంతాల్లో సోదా చేస్తున్నారు.
కాగా, రావు ఇంద్రజీత్ యాదవ్ సహచరుడైన అమన్ కుమార్‌కు చెందిన ఢిల్లీలోని సర్వప్రియ విహార్‌లో ఉన్న ఇంటిపై ఈడీ అధికారులు రైడ్ చేశారు. బెడ్ కింద కుప్పలుగా ఉన్న డబ్బు, నగలు చూసి షాక్ అయ్యారు. బ్యాంకు అధికారులను రప్పించారు. కౌంటింగ్ మెషిన్లతో ఆ డబ్బును లెక్కించగా రూ.5 కోట్లుగా తేలింది.
మరోవైపు ఒక సూట్‌కేస్ నిండా ఉన్న రూ.8.8 కోట్ల విలువైన బంగారం, వజ్రాలతో కూడిన నగలను గుర్తించారు. డబ్బు, నగలతో పాటు రూ.35 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలు, చెక్బుక్లున్న బ్యాగ్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
కాగా, జెమ్ రికార్డ్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (జెమ్స్ ట్యూన్స్) యజమాని అయిన రావు ఇంద్రజీత్ సింగ్ యాదవ్‌పై హత్య, దోపిడీ, మోసం, అక్రమ భూ కబ్జాలు, హింసాత్మక నేరాలు, మనీల్యాండరింగ్, ఆయుధాల చట్టంతో సహా అనేక కేసులు నమోదయ్యాయి. యూఏఈకి అతడు పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రావు సంస్థలతో పాటు అతడి నేరాలతో సంబంధం ఉన్న అనుచరుల సంస్థలు, వారి ఇళ్లలో సోదాలు చేస్తున్నారు.
Also Read:
Ex-Cop Dressed As Woman | మహిళ వేషంలో మాజీ పోలీస్.. అత్యాచార నిందితుడు అరెస్ట్
Watch: పోలీస్‌పై కత్తితో దాడికి వ్యక్తి యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?