Jonny Bairstow | దుబాయ్‌లో చిక్కుకున్నాం.. స్వదేశం వెళ్లేందుకు సాయం చేయండి..!
యుద్ధ వాతావరణం నెలకొన్న దుబాయ్‌లోనే ఇంగండ్ల జూనియర్ జట్టు కూడా ఉండిపోయింది. దాంతో.. తమను కాపాడాలని మాజీ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (Jonny Bairstow) ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశాడు.
Jonny Bairstow : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయేల్ సైనిక దాడులతో పశ్చిమాసియా వణికిపోతోంది. యునైఎట్ అరబ్ ఎమిరేట్స్‌కు యుద్ధం పాకడంతో.. దుబాయలోని వారంతా వణికిపోతున్నారు. అక్కడే చిక్కుకున్న పలువురు ప్రాణ భయంతో మమ్మల్ని కాపాడండి అని మొరపెట్టుకుంటున్నారు. యుద్ధ వాతావరణం నెలకొన్న దుబాయ్‌లోనే ఇంగండ్ల జూనియర్ జట్టు కూడా ఉండిపోయింది. దాంతో.. తమను కాపాడాలని మాజీ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (Jonny Bairstow) ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశాడు.
పశ్చిమాసియాలో శనివారం నుంచి యుద్ధ తీవ్రత కొనసాగుతోంది. యూఏఈలోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల దాడులకు తెగబడుతోంది. ఈ క్రమంలోనే దుబాయ్‌లోనూ బాంబుల వర్షం కురిపిస్తోంది. అయితే.. క్రికెట్ మ్యాచ్‌కోసం వచ్చిన ఇంగ్లండ్ లయన్స్ జట్టు విమానాల రద్దు కారణంగా ఇక్కడే చిక్కుకుపోయింది. దాంతో.. భద్రతపై అందరిలో ఆందోళన నెలకొన్నందున జానీ బెయిర్‌స్టో సోషల్ మీడియాలో పోస్ట్‌తో తమ పరిస్థితిని వివరించాడు.
Can you get us home???
— Jonny Bairstow (@jbairstow21) February 28, 2026
‘ఎమిరేట్స్.. చివరి ఫ్లయిట్ రద్దయ్యాక తదుపరి విమనం ఎప్పుడు? అనే సమాచారం మాకు అందలేదు. విమాన సంస్థను సంప్రదించేందుకు చాలా ప్రయత్నించాం. కానీ, ఉపయోగం లేదు. దయచేసి ఎవరైనా మాకు సాయం చేయండి. దుబాయ్‌లో ఎవరికైనా ఫ్లయిట్ సమాచారం తెలిసి ఉంటే మమ్నల్ని సంప్రదించండి’ అని బెయిర్‌స్టో తన పోస్ట్‌లో అభ్యర్థించాడు. మాజీ ఆటగాడు అండ్రూ ఫ్లింటాఫ్‌తో కలిసి ఇంగ్లండ్ లయన్స్ కోచ్‌గా అబుధాబీ వచ్చిన బెయిర్‌స్టో తమను సురక్షితంగా తలరించాలని ప్రాధేయపడుతున్నాడు. అతడి పోస్ట్‌పై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డగానీ, యూఏఈ ప్రభుత్వంగానీ ఇంకా స్పందించలేదు.
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, బాలీవుడ్ నటి సోనాలీ చౌహన్.. ‘మేము దుబాయ్‌లో చిక్కుకున్నాం. ఇక్కడ పరిస్థితి భయానకంగా ఉంది. మమ్మల్ని సురక్షితంగా తరలించడండి’ అని ఎక్స్ వేదికగా పోస్ట్‌లు పెట్టిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- America
- Dubai
- england lions
- iran
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

