Fire Accident : ఇండోనేషియా (Indonesia) లోని బాలి (Bali) సమీపంలో ఓ ఓడలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దాంతో ఆ ఓడ (Ferry) లోని 172 మంది అందులో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు (Rescue teams) వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు 131 మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఒకరు మరణించారు. మిగతా వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
సముద్రంలో పెద్ద ఎత్తున అలలు ఎగసిపడుతుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు పేర్కొన్నారు. గాలింపు చర్యలకు హెలికాప్టర్‌ను రంగంలోకి దించారు. బాలిలోని పడాంగ్ బాయి పోర్టు నుంచి లెంబార్ పోర్టుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఫెర్రీలో ప్రయాణికులతోపాటు 44 వాహనాలు, 53 మోటారు సైకిళ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు.