నివిన్ పౌలీ, సూరి, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘సంచారి’ అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది. రామ్ దర్శకత్వం వహించారు. కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎం.సుబ్బారెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.
‘రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నది. యువన్‌శంకర్‌రాజా సంగీతం ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తుంది. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలుంటాయి’ అని మేకర్స్ తెలిపారు.