Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ఉదయంతో మొదలయ్యే రోజు రాత్రికి పూర్తవుతుంది. కొన్ని మనం అనుకున్న విషయాలు, కొన్ని అనుకోని సందర్భాలతో ముగుస్తుంది. చాలాసార్లు అంతా రొటీన్ అనీ అనిపిస్తుంది. అలా కాకుండా మలిసంధ్యను... మరునాటికి ఉత్సాహాన్నిచ్చేదిగా, మంచి విజయానికి మెట్టుగా మార్చుకొనేందుకు విజేతలు పాటించే కొన్ని చిట్కాలున్నాయి.
ఉదయంతో మొదలయ్యే రోజు రాత్రికి పూర్తవుతుంది. కొన్ని మనం అనుకున్న విషయాలు, కొన్ని అనుకోని సందర్భాలతో ముగుస్తుంది. చాలాసార్లు అంతా రొటీన్ అనీ అనిపిస్తుంది. అలా కాకుండా మలిసంధ్యను… మరునాటికి ఉత్సాహాన్నిచ్చేదిగా, మంచి విజయానికి మెట్టుగా మార్చుకొనేందుకు విజేతలు పాటించే కొన్ని చిట్కాలున్నాయి.
✔ పనులన్నీ పూర్తయ్యాక సాయంసంధ్య వేళ ఓ పది నిమిషాలు ఆ రోజు ఎదురైన సవాళ్లను ఓసారి అవలోకించాలి. అందులో మనం ఎంత వరకూ కృతకృత్యులం అయ్యామో, ఎక్కడ అంచనా తప్పామో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కాస్త అవలోకిస్తే మరునాటికి కొన్ని మంచి ఆలోచనలు జమ చేసుకోవచ్చు.
✔ ప్రతి రోజూ కొంచెమైనా మనకు మంచి జరుగుతుంది. ఆరోజు మీరు అనుకున్నవి అనుకున్నట్టు పూర్తి చేసిన పనులు, వాటికి సహకరించిన వ్యక్తులు, మీ శరీరం, ఈ భూమి… ఇలా అన్నింటి పట్లా కృతజ్ఞత తెలిపేలా గ్రాటిట్యూడ్ జర్నల్ రాయడం అన్నది మరో రోజుకి పాజిటివ్ దృక్పథాన్ని పోగేసుకోవడమే.
✔ మంచినిద్ర కూడా మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది. తద్వారా చక్కటి నిర్ణయాలు తీసుకుంటాం. కాబట్టి నిద్రకు ఒక టైమ్‌ను నిర్ణయించుకోండి. చక్కగా పక్కను సర్దుకుని రోజూ ఆ సమయానికి వాలిపోండి.
సాయంత్రం వేళల్లో ఇంట్లో నలుగురినీ ఒక దగ్గర చేర్చి వాళ్లతో పాటు కబుర్లు చెప్పడానికి ప్రాధాన్యమివ్వండి. బంధాలు బలోపేతం అవ్వడమే కాదు, మీరూ ఉత్సాహంగా ఉంటారు.
తెల్లవారాక ఏం పనులు చేయాలి అనుకుంటున్నారో ముందురోజే రాసుకోవడం వల్ల కన్ఫ్యూజన్ లేకుండా పూర్తి చేసుకోవచ్చు. దానివల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది.
ఇక రోజును ఎలా ముగించామన్నదీ ముఖ్యమే. తేలికపాటి ఆహారం తీసుకోవడం, నిద్రకు చాలా ముందే గ్యాడ్జెట్లను పక్కన పెట్టేయడం, కెఫీన్‌కు దూరంగా ఉండటం లాంటివి నైట్ రొటీన్‌గా మార్చుకుంటే అనుకున్న లక్ష్యాలను సాధించడం ఎంతో సులువు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

