జెరూసలెం : ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు రహస్యంగా దుబాయ్లో పర్యటించారని ఛానెల్ 12టీవీ స్టేషన్ వెల్లడించింది. ఈ పర్యటన గురించి సమాచారం ఉన్న ఇద్దరు వ్యక్తులు సోమవారం దీన్ని ధ్రువీకరించారు. వారు చెబుతున్న దాని ప్రకారం.. ఇజ్రాయెల్ న్యూస్ పేపర్ హారెట్జ్లో ఈ నెల ప్రారంభంలో వచ్చిన నివేదిక చుట్టూ ఈ పర్యటన సాగింది.
2023 అక్టోబర్7న ఇజ్రాయెల్ మీద హమాస్ దాడులపై నెతన్యాహును యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ముందే హెచ్చరించారని హారెట్జ్ నివేదికలో ఉన్నది. ఈ నివేదిక నిజం కాదని.. దాన్ని ఖండించాలని యూఏఈ అధ్యక్షుడిని కోరేందుకు నెతన్యాహు వెళ్లారని ఆ ఇద్దరు చెబుతున్నారు. ఇప్పటికే నెతన్యాహు కార్యాలయం ఈ నివేదికను ఖండించింది. సెప్టెంబర్ 27 ఆదివారం వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. వీరిద్దరి చర్చలపై స్పందించేందుకు యూఏఈ విదేశాంగ శాఖ నిరాకరించింది.