Girl Declared Pregnant | బాలిక గర్భవతి అని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్ధారణ.. కాదని తేల్చిన ప్రైవేట్ హాస్పిటల్
Girl Declared Pregnant | నెలసరి సమస్యలకు చికిత్స కోసం అడ్మిట్ అయిన బాలిక గర్భవతి అని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్ధారించారు. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆ బాలిక గర్భం దాల్చలేదని తేలింది.
ముంబై: నెలసరి సమస్యలకు చికిత్స కోసం అడ్మిట్ అయిన బాలిక గర్భవతి అని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్ధారించారు. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆ బాలిక గర్భం దాల్చలేదని తేలింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. (Girl Declared Pregnant) మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 17 ఏళ్ల బాలిక నెలసరి సమస్యలతో బాధపడుతున్నది. చికిత్స కోసం కళ్యాణ్-డోంబివ్లి ప్రాంతంలోని శాస్త్రి నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె అడ్మిట్ అయ్యింది. అయితే బాలిక కుటుంబ సభ్యుల అనుమతి లేకుండానే ఆమెకు మూడుసార్లు గర్భధారణ పరీక్షలు చేశారు. ఆ బాలిక గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
కాగా, ఇది తెలుసుకుని బాలిక కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. నిర్ధారణ కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆ బాలిక గర్భం దాల్చలేదని తేలింది. అనంతరం పిరియడ్స్ సమస్యకు సంబంధించిన చికిత్సను అక్కడ అందించారు. దీంతో ఆ బాలిక కుటుంబ సభ్యుల ఆందోళన తొలగిపోయింది.
మరోవైపు ఈ సంఘటన నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో అనుసరించిన పరీక్షా విధానాలు, వైద్య ప్రక్రియలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనికి బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆ బాలిక కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు రావడంతో మున్సిపల్ కమిషనర్ విచారణకు ఆదేశించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

