Arikapudi Gandhi | ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ సమన్లు.. సెప్టెంబర్ 27న హాజరు కావాలని ఆదేశం
Arikapudi Gandhi | శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. సాహితి ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
Arikapudi Gandhi | శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. సాహితి ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సెప్టెంబర్ 27న ఈడీ ఎదుట హాజరుకావాలని సమన్లలో పేర్కొన్నట్లు సమాచారం.
సాహితి ఇన్ఫ్రాటెక్ ప్రాజెక్టుల పేరుతో కొనుగోలుదారుల నుంచి భారీగా నిధులు సేకరించి మోసం చేశారనే ఆరోపణలపై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు చేపట్టింది.
సాహితి ఇన్ఫ్రాటెక్ ప్రాజెక్టుల్లో తొలుత సుమారు రూ.248 కోట్ల మేర మోసం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. తదుపరి దర్యాప్తులో ఈ మొత్తం సుమారు రూ.842 కోట్లకు చేరినట్లు ఈడీ అంచనా వేసింది. ఫ్లాట్లు, విల్లాలు నిర్మించి ఇస్తామని చెప్పి ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో కొనుగోలుదారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు సేకరించినట్లు దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది.
సేకరించిన నిధుల్లో కొంత మొత్తాన్ని సంస్థకు సంబంధించిన వ్యక్తిగత, కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలకు మళ్లించినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించినట్లు పేర్కొంది. దాదాపు రూ.126 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయని తెలిపింది.
ఎమ్మెల్యే ఖాతాల ద్వారా రూ.2.1 కోట్ల లావాదేవీలపై ఆరా
ఈ కేసులో అరికెపూడి గాంధీకి సంబంధించిన బ్యాంకు ఖాతాల ద్వారా సాహితి ఇన్ఫ్రా నుంచి సుమారు రూ.2.1 కోట్లు బదిలీ అయినట్లు ఈడీ గుర్తించినట్లు పేర్కొంది. ఈ లావాదేవీల స్వభావం, ఉద్దేశం, వాటికి సంబంధించిన ఆర్థిక సంబంధాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. మనీలాండరింగ్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఆస్తులు, లావాదేవీలపైనా ఈడీ దృష్టి సారించింది.
దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు 56 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు ఈడీ పేర్కొంది. గతంలో సుమారు రూ.161 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన అధికారులు, మరో విడతలో రూ.12.6 కోట్ల విలువైన ఆస్తులను కూడా అటాచ్ చేసినట్లు వెల్లడించారు. బినామీ పేర్లతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు ఈడీ ఆరోపిస్తోంది.
సాహితి ఇన్ఫ్రా ఎండీ అరెస్టు
సాహితి ఇన్ఫ్రాటెక్ కేసులో సంస్థ ఎండీ బి. లక్ష్మీనారాయణ, మాజీ డైరెక్టర్ సందు పూర్ణచంద్రరావు తదితరులపై దర్యాప్తు కొనసాగుతోంది. సంస్థ ఎండీ బి. లక్ష్మీనారాయణను 2024 సెప్టెంబర్‌లో ఈడీ అరెస్టు చేసింది. సాహితి ఇన్ఫ్రా ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటనల్లో కనిపించిన నటుడు జగపతిబాబును కూడా ఈడీ గతంలో సాక్షిగా విచారించినట్లు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

