D56 | సితార బ్యానర్లో ధనుష్ కొత్త చిత్రం.. పూజా కార్యక్రమాలతో గ్రాండ్ లాంఛ్!
D56 | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న తాజా సినిమా 'డి-56' (D56) మధురైలో పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. 'లబ్బర్ పందు' (Lubber Pandhu) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు తమిళరసన్ పచముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో ధనుష్ కెరీర్లో మరో వైవిధ్యమైన చిత్రం రాబోతుందని అభిమానులు భావిస్తున్నారు.
Dhanush | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న తాజా సినిమా ‘డి-56’ (D56) మధురైలో పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. ‘లబ్బర్ పందు’ (Lubber Pandhu) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు తమిళరసన్ పచముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో ధనుష్ కెరీర్లో మరో వైవిధ్యమైన చిత్రం రాబోతుందని అభిమానులు భావిస్తున్నారు.
ఈ చిత్రంలో ధనుష్ సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటిస్తుండగా, లెజెండరీ కమెడియన్ వడివేలు, టాలెంటెడ్ నటుడు ఎస్.జె. సూర్య మరియు ‘ఉరియడి’ ఫేమ్ విజయ్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భిన్నమైన తరాల నటుల కలయికతో వస్తున్న ఈ భారీ తారాగణంపై సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు సాయి అభ్యాంకర్ సంగీతం అందిస్తుండటం విశేషం.
ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ప్రైమ్మార్క్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మధురైలో లాంఛ్ కార్యక్రమం పూర్తి కావడంతో, త్వరలోనే సినిమా షూటింగ్ తో పాటు కథకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. మరోవైపు ధనుష్ నటించిన ‘ఓం’ (OM) సినిమా నవంబర్లో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఒకవైపు రిలీజ్కు రెడీ అవుతూనే, మరోవైపు ఇలా కొత్త ప్రాజెక్ట్ను కూడా అధికారికంగా ప్రారంభించి ధనుష్ ఫుల్ స్పీడ్తో దూసుకెళ్తున్నారు.
#D56 Pooja still📸🔥
Dhanush – PreityMukundhan – SJSuryah – Vadivelu – Tamilarasan Pachamuthu pic.twitter.com/FIHjYdcaOL
— AmuthaBharathi (@CinemaWithAB) September 25, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- D56
- dhanush
- PreityMukundan
- SJSuryah
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

