Burj Khalifa : దుబాయ్‌లోని అమెరికాకు చెందిన సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అక్కడి ప్రముఖ బుర్జ్ ఖలీఫాపై కూడా ఇరాన్ క్షిపణుల ప్రయోగం జరిగింది. ఒకవేళ నిజంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ అయిన బుర్జ్ ఖలీఫాపై దాడి జరిగితే పరిస్థితి ఏంటి..? ఆ బిల్డింగ్‌కు ఇన్సూరెన్స్ ఉందా..? ఈ అంశంపై ఇప్పుడో ఆసక్తికర చర్చ జరుగుతోంది. స్థానిక మీడియా నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బుర్జ్ ఖలీఫాకు ఇన్సూరెన్స్ ఉంది.
ఈ బిల్డింగ్ డెవలపర్ దీనికి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. ఏదైనా డ్యామేజ్ జరిగితే వర్తించేలా ప్రాపర్టీ ప్రొటెక్షన్, పొలిటికల్ వయొలెన్స్‌కు సంబంధించి బుర్జ్ ఖలీఫాకు ఇన్సూరెన్స్ ఉంది. ఒక ప్రముఖ కంపెనీతో ఈ మేరకు ఒప్పందం ఉంది. తీవ్రవాద దాడులు, ఇతర దాడులు, ముప్పు నుంచి ఇన్సూరెన్స్ లభిస్తుంది. అయితే, అది పూర్తిగా లభిస్తుందా లేదా అనేది తెలియదు. ఈ బిల్డింగ్‌కు సంబంధించి డెవలపర్ చేసిన ఇన్సూరెన్స్ మాత్రమే కాకుండా అందులోని పలు అపార్ట్మెంట్ల ఓనర్లు, హోటల్స్, రెస్టారెంట్స్, ఆఫీసెస్ వంటి వాటి యాజమాన్యాలు కూడా సెపరేట్‌గా ఇన్సూరెన్స్ కలిగి ఉన్నారు. బుర్జ్ ఖలీఫా రీప్లేస్మెంట్ విలువ ఒరిజినల్ కన్నా ఎక్కువగా ఉండొచ్చని అంచనా. అయితే, ఇలాంటి యుద్ధ పరిస్థితుల్లో ఎలాంటి ఇన్సూరెన్స్ వర్తిస్తుందనేదే సమస్య.
ముఖ్యంగా మిలిటరీ దాడుల్లో నష్టం జరిగితే ఇన్సూరెన్స్ వర్తించేలా ఉంటేనే అది లభిస్తుంది. దీనికి ఉన్న పరిమితులు, నిబంధనల్ని అనుసరించి మాత్రమే కవరేజ్ లభిస్తుంది. అది కూడా పాక్షికంగానా లేదా పూర్తిగానే అనేది కూడా తెలియదు. ఇక ప్రస్తుతం దుబాయ్‌పై ఇరాన్ క్షిపణి దాడులు చేస్తోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ కూడా మిస్సైల్స్‌తో విరుచుకుపడుతోంది. యుద్ధం నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో బుర్జ్ ఖలీఫా రక్షణపై ఆందోళన కలుగుతోంది.