CBSE Exams | పశ్చిమాసియా దేశాల్లో.. మార్చి 2న జరగాల్సిన పరీక్షలను సీబీఎస్ఈ వాయిదా
CBSE Exams | అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పలు పశ్చిమాసియా దేశాలలో మార్చి 2న జరగాల్సిన పరీక్షలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వాయిదా వేసింది. మార్చి 2న జరగాల్సిన 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను వాయిదా వేసినట్లు సీబీఎస్ఈ ఆదివారం ప్రకటించింది.
న్యూఢిల్లీ: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పలు పశ్చిమాసియా దేశాలలో మార్చి 2న జరగాల్సిన పరీక్షలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వాయిదా వేసింది. (CBSE Exams) మార్చి 2న జరగాల్సిన 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను వాయిదా వేసినట్లు సీబీఎస్ఈ ఆదివారం ప్రకటించింది. పరీక్ష నిర్వహించే కొత్త తేదీలను త్వరలో తెలియజేస్తామని పేర్కొంది. మార్చి 3న సమీక్ష తర్వాత మార్చి 5 నుంచి జరుగాల్సిన మిగతా పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని 150కు పైగా సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల ప్రిన్సిపాల్లకు ఈ సమాచారం పంపినట్లు పేర్కొంది.
కాగా, సీబీఎస్ఈ 10, 12 తరగతుల బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 18న ప్రారంభమయ్యాయి. భారత్‌తో పాటు విదేశాల్లోని 25.1 లక్షల మంది 10వ తరగతి విద్యార్థులు, 18.6 లక్షల మంది 12వ తరగతి విద్యార్థులు సహా మొత్తం 43.7 లక్షలకుపైగా విద్యార్థులు సీబీఎస్ఈ పరీక్షలకు హాజరవుతున్నారు.
మరోవైపు సీబీఎస్ఈకి పశ్చిమాసియాలో పెతిపెద్ద విదేశీ క్లస్టర్ ఉన్నది. దుబాయ్, అబుదాబి, దోహా, రియాద్‌లో కీలకమైన పరీక్షా కేంద్రాలున్నాయి. అయితే అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం కమాండర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. దీంతో ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ప్రతీకార దాడులకు ఇరాన్ పాల్పడుతున్నది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల్లో మార్చి 2న సోమవారం జరుగాల్సిన పరీక్షలను సీబీఎస్ఈ వాయిదా వేసింది.
Also Read:
Iran Flag Lowered | ఖమేనీ మృతికి సంతాపంగా.. ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీలో జెండా అవనతం
bank staffer dies by suicide | బ్యాంకు ఉద్యోగిని కరిచిన కుక్క.. రేబిస్ భయంతో ఆత్మహత్య
woman throws daughter into river | కుమార్తెను నదిలోకి విసిరేసిన మహిళ.. ఆమె దూకబోగా కాపాడిన వ్యక్తి
Watch: చాలా దూరం కారును ఈడ్చుకెళ్లిన లారీ.. షాకింగ్ వీడియో వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

