న్యూఢిల్లీ: ప్రముఖ చరిత్రకారుడు సుమిత్ సర్కార్(Sumit Sarkar) కన్నుమూశారు. ఢిల్లీలోని ఆయన నివాసం తుది శ్వాస విడిచారు. వయసు సంబంధిత రుగ్మతలతో ఆయన బాధపడుతున్నారు. ఆయన వయసు 87 ఏళ్లు. చాన్నాళ్ల నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించింది. పబ్లిక్‌గా ఆయన యాక్టివ్‌గా లేరు. సుమిత్ భార్య తనికా సర్కార్ కూడా హిస్టోరియన్. వారి కుమారుడు ఆదిత్య సర్కార్.. వార్విక్ యూనివర్సిటీలోని సౌత్ ఏషియన్ హిస్టరీ లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. శనివారం సుమిత్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రఖ్యాత చరిత్రకారుడు సుశోభన్ సర్కార్ కుమారుడే సుమిత్. 1939లో ఆయన జన్మించారు.
కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో చదివారు. కోల్‌కతా యూనివర్సిటీలో దక్షిణాసియా డయాస్పోరాపై పీహెచ్డీ చేశారు. తొలుత కోల్‌కతా వర్సిటీలో లెక్చరర్‌గా చేశారు. బురద్వాన్ వర్సిటీలో రీడర్‌గా చేశారు. ఢిల్లీ వర్సిటీలో చాన్నాళ్లు ఆయన హిస్టరీ ప్రొఫెసర్‌గా చేశారు. ద స్వదేశీ మూమెంట్ ఇన్ బెంగాల్, మాడ్రన్ ఇండియా:1885–1947”, రైటింగ్ సోషల్ హిస్టరీ బుక్ రాశారు. జాతీయవాదం, స్వతంత్య్ర పోరాటం, బ్రిటీషవాదం గురించి ఆయన విస్తృతంగా రాశారు. మార్కిస్ట్ హిస్టోరియన్‌గా ఆయనకు గుర్తింపు ఉన్నది. సరిత్ ఛటర్జీ మెమోరియల్ అవార్డును ఆయన అందుకున్నారు. సోషల్ హిస్టరీ బుక్కు రబీంద్ర పుష్కర్ అవార్డును గెలుచుకున్నారు.