కమాన్పూర్, సెప్టెంబర్ 27: రాష్ట్రస్థాయి జూనియర్ చాంపియన్షిప్ అథ్లెటిక్స్ పోటీల్లో పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి ఆనంది రెండు స్వర్ణాలు సాధించింది. హనుమకొండలో ఆదివారం ముగిసిన రాష్ట్ర స్థాయి 12వ తెలంగాణ స్టేట్ అథ్లెటిక్స్ జూనియర్ చాంపియన్ షిప్ పోటీల్లో ఆమె.. అండర్ – 18 విభాగంలో 400 మీటర్ల, 200 మీటర్ల రన్నింగ్ రేసులో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాలను గెలుచుకుంది.