టెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖొమేనీ అమెరికా- ఇజ్రాయెల్ దాడుల్లో రెండుసార్లు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని ఇరాన్ మతాధికారి మొహ్సెన్ హైదరీ వెల్లడించారు. మొజ్తబా తొలిదాడిలో గాయపడి దవాఖానలో చికిత్స పొందుతుండగా, ఆ దవాఖానపైనా దాడి జరిగిందని తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న మొజ్తబాను సహాయ సిబ్బంది బయటకు తీసినట్లు చెప్పారు. తన తండ్రి అయతుల్లా అలీ ఖొమేనీపై జరిగిన దాడిలోనే 59 ఏండ్ల మొజ్తబా ఖొమేనీ గాయపడ్డారు.
అనంతరం ఆయనను టెహ్రాన్‌లోని దవాఖానకు తరలించి చికిత్స అందించారు. అయితే ఆ వైద్య కేంద్రంపైనా దాడి జరగడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. టెహ్రాన్‌లోని మూడు దవాఖానలపై దాడులు జరిగాయి. ఒక దవాఖానలో ఉన్న మొజ్తబా శిథిలాల కింద చిక్కుకున్నారని, అనంతరం ఆయనను బయటకు తీసుకువచ్చినట్లు అల్ అరబీ టీవీకి మొహ్సెన్ హైదరీ తెలిపారు.