ప్రతిష్టాత్మక ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్(ఎఫ్ఎన్సీసీ) నూతన అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆదిశేషగిరిరావు ప్యానెల్ తరపున పోటీచేసిన మోహన్ ముళ్లపూడి కార్యదర్శిగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. అధ్యక్షుడిగా కేఎస్ రామారావు తప్ప మిగిలిన ప్యానెల్ మొత్తం ఓటమి పొందడం గమనార్హం. ఎఫ్ఎన్సీసీలో మొత్తం 2799 మంది ఓటర్లు ఉండగా వారిలో 1585మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్షుడిగా పోటీచేసిన ఆదిశేషగిరిరావు ఓటమి పాలవగా, అయన ప్యానెల్ తరపున పోటీచేసిన మోహన్ ముళ్లపూడి కార్యదర్శిగా, సదాశివరెడ్డి ఉపాధ్యక్షుడిగా, శైలజ కోశాధికారిగా, సంయుక్త కార్యదర్శిగా ఎస్ఎన్ రెడ్డి గెలుపొందారు. వీరితో పాటు ఇదే ప్యానెల్ తరపున పోటీచేసిన ఏడిద రాజా, కృష్ణంరాజు, శ్రీనివాసరాజు, కిషోర్, కాజా సూర్యనారాయణ, మురళీమోహన్రావు, భాస్కర్‌నాయుడు, బాలరాజు,నాగసుష్మ పాలకమండలి సభ్యులుగా విజయం సాధించారు.