Iran Flag Lowered | ఖమేనీ మృతికి సంతాపంగా.. ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీలో జెండా అవనతం
Iran Flag Lowered | అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం కమాండర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఈ నేపథ్యంలో భారత రాజధాని ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఉన్న ఆ దేశ జెండాను సగానికి అవనతం చేశారు.
న్యూఢిల్లీ: అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం కమాండర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఈ నేపథ్యంలో భారత రాజధాని ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఉన్న ఆ దేశ జెండాను సగానికి అవనతం చేశారు. (Iran Flag Lowered) ఖమేనీ మరణం పట్ల ఇరాన్ ఎంబసీ ఈమేరకు సంతాపం తెలియజేసింది. అమెరికా సహాయంతో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఖండించింది.
కాగా, అమెరికా- ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండటంతో ఇరాన్ తన పౌరులకు పలు సూచనలు జారీ చేసింది. పౌరులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఇరాన్ ప్రజల ముఖ్యమైన అవసరాలను తీర్చడానికి ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. ప్రాథమిక నిత్యవసరాల సరఫరాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది.
మరోవైపు దాడుల నేపథ్యంలో స్కూల్స్, యూనివర్సిటీలను ఇరాన్ మూసివేసింది. అయితే బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని తెలిపింది. ప్రభుత్వ కార్యాలయాలు ప్రస్తుతం 50 శాతం సామర్థ్యంతో పనిచేస్తాయని ఇరాన్ ఎంబసీ ఒక ప్రకటనలో పేర్కొంది.
#WATCH | The Iranian Embassy in Delhi has lowered its flag to half-mast following the death of Iran’s Supreme Leader Ayatollah Ali Khamenei
He has been killed in Israeli and US strikes. pic.twitter.com/zWwDQI8dSj
— ANI (@ANI) March 1, 2026
Also Read:
bank staffer dies by suicide | బ్యాంకు ఉద్యోగిని కరిచిన కుక్క.. రేబిస్ భయంతో ఆత్మహత్య
woman throws daughter into river | కుమార్తెను నదిలోకి విసిరేసిన మహిళ.. ఆమె దూకబోగా కాపాడిన వ్యక్తి
Watch: చాలా దూరం కారును ఈడ్చుకెళ్లిన లారీ.. షాకింగ్ వీడియో వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

