Rashmika Mandanna | గాయం కారణంగా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్న రష్మిక.. జీవితంపై ఇన్స్టాలో ఆసక్తికర పోస్ట్!
Rashmika Mandanna | టాలీవుడ్ ప్రముఖ నటి రష్మికా మందన్నా ప్రస్తుతం గాయం కారణంగా సినిమాలకు దూరంగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే.
Rashmika Mandanna | టాలీవుడ్ ప్రముఖ నటి రష్మికా మందన్నా ప్రస్తుతం గాయం కారణంగా సినిమాలకు దూరంగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెస్ట్ సమయంలో తన ఆలోచనల్లో వచ్చిన మార్పుల గురించి ఆమె ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఎప్పుడూ తీరిక లేకుండా ఉరుకులు పరుగులతో బిజీగా గడిపేవారికి, ఒక్కసారిగా పనులు ఆపేసి విశ్రాంతి తీసుకోవడం మొదట్లో చాలా భయంగా అనిపిస్తుందని రష్మిక తెలిపారు. అయితే, తప్పనిసరి పరిస్థితుల్లో అలా విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే.. గతంలో అలా పిచ్చివాళ్లలా పనుల వెనకే పరిగెత్తిన దినాలు ఇప్పుడు తలచుకుంటే మరింత భయంగా అనిపిస్తాయని, బహుశా జీవితం అంటే ఇదేమో అని ఆమె పేర్కొన్నారు. ఇక ఈ రికవరీ సమయంలో తన దినచర్య ఎలా సాగుతుందో కూడా ఆమె వివరించారు. ఎలాంటి అలారాలు పెట్టుకోకుండా శరీరం కోరిన సమయానికి లేవడం, రోజుకు రెండు పూటల మితంగా భోజనం చేయడం, తన పెంపుడు కుక్క ‘ఆరా’తో సమయం గడపడం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే పుస్తకాలు చదవడం, పజిల్స్ చేయడం, ఇష్టమైన షోలు చూడటంతో పాటు పాత ఫోటోలు, వీడియోలను నెమరువేసుకుంటూ ప్రశాంతంగా గడుపుతున్నానని చెప్పారు.
ఈ కష్టకాలంలో తాను త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అభిమానులు, శ్రేయోభిలాషులు పంపిస్తున్న ప్రార్థనలకు, చూపుతున్న ప్రేమానురాగాలకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ చిత్ర షూటింగ్లో భాగంగా ఒక డ్యాన్స్ సీక్వెన్స్ చేస్తుండగా రష్మిక తుంటి భాగంలో గాయమైంది. వైద్యుల సూచన మేరకు ఆమె కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి రావడంతో ప్రస్తుతం పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు.
View this post on Instagram
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

