భారత్, చైనాపై 100% సుంకాలు!
రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం సంతకం చేశారు. దీంతో అది చట్టంగా మారడానికి మార్గం సుగమం అయినట్టు వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. రష్యాతోపాటు భారత్, చైనా వంటి దాని ప్రధాన ఇంధన కొనుగోలుదారులపై భారీ సుంకాలు విధించాలని రష్యా, ఇరాన్‌పై ఆంక్షల చట్టం లక్ష్యంగా పెట్టుకొన్నది.
- రష్యా ఆంక్షల బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం
- 30 రోజుల్లోగా అమల్లోకి చట్టం
వాషింగ్టన్, సెప్టెంబర్ 19: రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం సంతకం చేశారు. దీంతో అది చట్టంగా మారడానికి మార్గం సుగమం అయినట్టు వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. రష్యాతోపాటు భారత్, చైనా వంటి దాని ప్రధాన ఇంధన కొనుగోలుదారులపై భారీ సుంకాలు విధించాలని రష్యా, ఇరాన్‌పై ఆంక్షల చట్టం లక్ష్యంగా పెట్టుకొన్నది. రష్యా నాయకత్వం, దాని ఇంధన రంగంపైన, అలాగే ఆ దేశ రక్షణ పరిశ్రమ, దాని షాడో ఫ్లీట్‌కు సహకరిస్తున్న దేశాలపై ఆంక్షలు విధించే లక్ష్యంతో రూపొందించిన రష్యా, ఇరాన్‌పై ఆంక్షల చట్టాన్ని అమెరికా ప్రతినిధుల సభ బుధవారం(సెప్టెంబర్ 16) ఆమోదించింది.
రష్యా నుంచి చమురు, సహజ వాయువును కొనుగోలు చేసే చైనా, భారత్‌తో సహా ఇతర దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారాన్ని కూడా ఈ చట్టం అధ్యక్షుడు ట్రంప్‌నకు కల్పిస్తుంది. చట్టం అమల్లోకి రావడానికి ముందున్న 12 నెలల కాలంలో రష్యా నుంచి చమురు లేదా సహజ వాయువును అత్యధిక పరిమాణంలో కొనుగోలు చేసిన మొదటి ఐదు దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 100 శాతం వరకు సుంకాలు విధించాల్సి ఉంటుంది. నిర్దిష్ట కాలంలో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న గ్యాస్ పరిమాణం ఆ దేశ మొత్తం గ్యాస్ దిగుమతుల్లో 15 శాతం కంటే తక్కువగా ఉంటే సుంకాల నుంచి మినహాయింపు లభిస్తుంది. రష్యాపై ఆంక్షల బిల్లుపై సంతకం చేసినందుకు ట్రంప్‌కు, బిల్లుకు మద్దతునిచ్చినఅమెరికన్ కాంగ్రెస్ సభ్యులకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

