జడ గొలుసులు ఇవి!
సిగలో నాలుగు పువ్వులు తురిమి అలంకారం ముగించేకాలం నుంచి వెంట్రుకలను వేయి మాడళ్లలో మలిచేదాకా ఫ్యాషన్ ప్రయాణం సాగుతున్నది. జడవేయడంతో పని పూర్తవదు, దాని ముస్తాబులోనే అసలు సంగతి దాగి ఉంది. పూల జడలు అందులో తొలి రకమైతే జడ బిళ్లలు, పూసలు, పువ్వులతో ముస్తాబయ్యే హెయిర్ యాక్సెసరీలు కొనసాగింపులు.
నడుము గొలుసులు, మెడ గొలుసులు మనకు తెలిసినవే. కానీ, జడ గొలుసులూ ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో తమ ముద్రను వేస్తున్నాయి. పూలజడకు పోటీ పడుతూ అందాలు ఒలికిస్తున్నాయి. తమ హెయిర్ ైస్టెల్‌ను విభిన్నంగా అలంకరించాలి అనుకునే వారికి ఇవి ఎంతగానో నచ్చుతున్నాయి. హెయిర్ చెయిన్ పేరిట మార్కెట్లో దొరుతున్న వీటిలో వెరైటీలెన్నో..!
సిగలో నాలుగు పువ్వులు తురిమి అలంకారం ముగించేకాలం నుంచి వెంట్రుకలను వేయి మాడళ్లలో మలిచేదాకా ఫ్యాషన్ ప్రయాణం సాగుతున్నది. జడవేయడంతో పని పూర్తవదు, దాని ముస్తాబులోనే అసలు సంగతి దాగి ఉంది. పూల జడలు అందులో తొలి రకమైతే జడ బిళ్లలు, పూసలు, పువ్వులతో ముస్తాబయ్యే హెయిర్ యాక్సెసరీలు కొనసాగింపులు. ఇప్పుడు కురులకు మరిన్ని సొబగులద్దేలా జడ గొలుసులు… అదేనండీ, ‘హెయిర్ చెయిన్’లు వస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి యువతుల దాకా ఎవరైనా అవసరాన్ని బట్టి పెట్టుకోగలగడం వీటి ప్రత్యేకత.

ఎన్నో రకాలు…
జడను అలంకరించాలి. అలాగని పువ్వులతో కాదు… అనుకున్నప్పుడు పూల అల్లికలు ఉండే క్రోచెట్ హెయిర్ చెయిన్లు చక్కగా నప్పుతాయి. తలపై నుంచి కింది వరకూ జడతో పాటు వీటిని అందంగా అల్లుకోవచ్చు. పూల జడను తలపిస్తూనే ఫ్యాషన్ లుక్‌ని సొంతం చేసుకోవచ్చు. అలా కాకుండా జడ పొడవుగా వేలాడేలా రకరకాల పువ్వులతో తయారయ్యే హెయిర్ స్ట్రింగ్లూ దొరుకుతున్నాయి. ఇక, రంగు రంగుల రాళ్లతో తయారయ్యేవి అయితే గొలుసుల్లా వేలాడుతూ నగలు అలంకరించిన లుక్‌ని తీసుకొస్తాయి.

మరో రకంలో తీగలు, పూసలు, పువ్వులు, సీతాకోక చిలుకల్లాంటివి వరుసల్లో అమరిపోయి జడను ముస్తాబు చేస్తాయి. అదీ కాదంటే రంగు రంగుల దారాల అల్లికలు మరో రకం. మనం ఏ డ్రెస్ వేసుకున్నాం, ఎలాంటి హెయిర్ ైస్టెల్ ఎంచుకున్నాం అనేదాన్ని బట్టి ఈ హెయిర్ చెయిన్లను సెలెక్ట్ చేసుకోవచ్చు. చిన్న పిల్లల కోసం పువ్వుల తీగలను తలపించేవీ దొరుకుతున్నాయి. మొత్తంగా చెప్పాలంటే రెగ్యులర్‌గా అనిపించకుండా, అందంగా కనిపించేలా కురుల్ని ైస్టెలింగ్ చేయాలంటే వీటిని ఎంచుకోవడమే… ఏమంటారు?!
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

