George Krish | టాలీవుడ్లో కొత్త కాంబినేషన్.. శ్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్ కొత్త సినిమా షురూ!
Sharwanand and Sreenu Vaitla | టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన క్రేజీ కాంబినేషన్ అధికారికంగా పట్టాలెక్కింది. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించే చార్మింగ్ హీరో శర్వానంద్, విలక్షణమైన కామెడీ టైమింగ్తో కూడిన ఎంటర్టైనర్లను తెరకెక్కించే ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో తొలిసారిగా కలిసి పనిచేస్తున్నారు.
Sharwanand and Sreenu Vaitla | టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన క్రేజీ కాంబినేషన్ అధికారికంగా పట్టాలెక్కింది. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించే చార్మింగ్ హీరో శర్వానంద్, విలక్షణమైన కామెడీ టైమింగ్తో కూడిన ఎంటర్టైనర్లను తెరకెక్కించే ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో తొలిసారిగా కలిసి పనిచేస్తున్నారు. వీళ్లిద్దరి కలయికలో రాబోతున్న ఈ సరికొత్త ప్రాజెక్ట్పై టాలీవుడ్ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
అనిల్ సుంకర నిర్మాణంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ (AK Entertainments) పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతుండగా తాజాగా ఈ సినిమా టైటిల్తో పాటు పూజా కార్యక్రమాలు ఘనంగా జరుపుకున్నారు. ఇక ఈ సినిమాకు మేకర్స్ ‘జార్జ్ క్రిష్’ (George Krish) అనే క్రేజీ టైటిల్ను ఖరారు చేశారు. శ్రీను వైట్ల మార్క్ ఎంటర్టైన్మెంట్, శర్వానంద్ ఎనర్జిటిక్ యాక్టింగ్ ఈ సినిమాకు ప్రధాన హైలైట్గా నిలవనున్నాయి. సినిమా ప్రారంభోత్సవ రోజే విడుదల తేదీని ప్రకటించి మేకర్స్ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక ఈ పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. లాంచింగ్ రోజే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో కూడా మంచి బజ్ క్రియేట్ అయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

