Butter | రాత్రి పూట వెన్నను తింటే నిద్ర బాగా పడుతుందా.. వైద్యులు ఏమంటున్నారు..?
నేటి తరుణంలో సమయానికి నిద్ర పోవడం కూడా కష్టతరంగా మారిందని చెప్పవచ్చు. నిద్ర కూడా శరీరానికి చాలా అవసరం. కానీ చాలా మంది నిద్రపోవడంపై అంతలా శ్రద్ద చూపించరు. నిద్రను విస్మరిస్తూ ఉంటారు. ఫోన్ లను ఎక్కువగా చూడడం, గంటల తరబడి టీవీలు చూడడం, రాత్రి సమయంలో ఆలస్యంగా నిద్రపోవడం వల్ల విశ్రాంతి తీసుకోవడం కష్టతరంగా మారుతుంది.
Butter | నేటి తరుణంలో సమయానికి నిద్ర పోవడం కూడా కష్టతరంగా మారిందని చెప్పవచ్చు. నిద్ర కూడా శరీరానికి చాలా అవసరం. కానీ చాలా మంది నిద్రపోవడంపై అంతలా శ్రద్ద చూపించరు. నిద్రను విస్మరిస్తూ ఉంటారు. ఫోన్ లను ఎక్కువగా చూడడం, గంటల తరబడి టీవీలు చూడడం, రాత్రి సమయంలో ఆలస్యంగా నిద్రపోవడం వల్ల విశ్రాంతి తీసుకోవడం కష్టతరంగా మారుతుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో నిద్ర గురించి ఒక కొత్త ట్రెండ్ నడుస్తుందని చెప్పవచ్చు. పడుకునే ముందు వెన్న తినడం వల్ల బాగా నిద్ర వస్తుందని ట్రెండ్ నడుస్తోంది. అయితే రాత్రి సమయంలో వెన్న తినడం వల్ల నిజంగా నిద్ర వస్తుందా.. ఇందులో వాస్తవమెంత.. వైద్యులు దీని గురించి ఏం చెబుతున్నారో.. ఇప్పుడు తెలుసుకుందాం.
వైద్యులు ఏమంటున్నారు..?
పడుకునే ముందు వెన్న తినడం వల్ల నిద్ర బాగా పడుతుందని, ఎక్కువ సమయం నిద్ర పోతారని చెప్పడంలో ఎటువంటి ఆధారాలు లేవని వైద్యులు చెబుతున్నారు. వెన్నలో ఎక్కువగా సంతృప్త కొవ్వులు, తక్కువ మొత్తంలో నిద్రకు ఉపయోగపడే ప్రోటీన్, ట్రిప్టోఫాన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. వెన్నను నిద్రకు సహాయకంగా ఉపయోగించడం సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ మాత్రమే అని వైద్యులు తెలియజేస్తున్నారు. మంచి నిద్రకు క్రమబద్దమైన అలవాట్లు చాలా అవసరమని కూడా వారు చెబుతున్నారు. అలాగే రాత్రి సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం వల్ల చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాల కారణంగా నిద్రకు భంగం కలుగుతుంది. ఇలా చక్కెర స్థాయిలు తగ్గకుండా ఉండడానికి చాలా మంది వెన్న వంటి కొవ్వు పదార్థాలను తీసుకోవడం మంచిదని భావిస్తూ ఉంటారు. కానీ వెన్న లాంటి కొవ్వు పదార్థాలను తీసుకోవడం వల్ల క్యాలరీలు పెరగడం తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదని రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గకుండా ఉండాలంటే ప్రోటీన్, ఫైబర్, సంక్లిష్ట కార్బొహైడ్రేట్లు కలిసి ఉండే ఆహారాలను తీసుకోవాలని వైద్యులు తెలియజేస్తున్నారు.
వీటిని తినకూడదు..
వెన్న వంటి కొవ్వు పదార్థాలు, చక్కెర వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల నిద్రకు మరింత భంగం కలిగే అవకాశం ఉందని అలాగే యాసిడ్ రిఫ్లెక్స్, అజీర్ణం, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వంటి ప్రమాదం ఉన్న వారు రాత్రి పూట కొవ్వు పదార్థాలను తీసుకోవడం మానేయాలని వైద్యులు సూచిస్తున్నారు. రాత్రి పూట ఆకలి ఎక్కువగా అవుతుంది అనుకునే వారు కేవలం కొవ్వు పదార్థాలను కాకుండా ప్రోటీన్, సంక్లిష్ట కార్బొహైడ్రేట్స్ కలిగిన ఉన్న ఆహారాలను నిద్ర పోవడానికి రెండు గంటల ముందు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల రాత్రంతా రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇక నిద్ర మెరుగుపడాలంటే ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. నిద్రకు ముందు స్క్రీన్ వినియోగాన్ని తగ్గించాలి. సాయంత్రం తరువాత కెఫిన్ వంటి ఆహారాలను తీసుకోవడం తగ్గించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Butter
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

