లక్నో: న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో ఒక ఎస్ఐ మద్యం సేవించాడు. సివిల్ దుస్తుల్లో ఉన్న ఆయన మద్యం మత్తులో కారు డ్రైవ్ చేశాడు. వాహనాలు మళ్లేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్లపైకి దూసుకెళ్లాడు. అడ్డుకుని నిలదీసిన పోలీస్ అధికారి, పోలీస్ సిబ్బందిపై రంకెలు వేశాడు. (Drunk Sub-Inspector Rams Car) ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. డిసెంబర్ 31 అర్ధరాత్రి వేళ న్యూఇయర్ వేడుకల సందడి నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
కాగా, లక్నోలోని హజ్రత్‌గంజ్ కూడలి వద్ద జన సమూహం, వాహనాల రద్దీ నియంత్రణకు ట్రాఫిక్ మళ్లింపు కోసం బారికేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు. మద్యం సేవించిన ఒక ఎస్ఐ కారు డ్రైవ్ చేశాడు. బారికేడ్లు ఏర్పాటు చేసి వైపు వచ్చాడు. వెనక్కి వెళ్లాలని వెళ్లాలని పోలీసులు సూచించినా పట్టించుకోలేదు. రోడ్డుకు అడ్డుగా ఉంచిన బారికేడ్ల మీదకు కారును దూకించాడు.
మరోవైపు పోలీసులు ఆ కారును అడ్డుకున్నారు. డ్రైవ్ చేసిన వ్యక్తి పోలీస్‌గా గుర్తించారు. కారులో మద్యం బాటిల్ ఉండటంతో అతడు తాగి నడిపినట్లు పోలీసులు గ్రహించారు. కారు నుంచి కిందకు దిగిన ఆ ఎస్ఐ విధుల్లో ఉన్న ట్రాఫిక్ డీసీపీతోపాటు ఇతర పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించాడు. అతడ్ని నిలువరించిన పోలీసులను బెదిరించాడు.
చివరకు పోలీసులు కూడా సహనం కోల్పోయారు. బారాబంకి పోలీస్ లైన్స్‌లో పనిచేస్తున్న ఎస్ఐ అమిత్ జైస్వాల్గా గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ ఎస్ఐ ప్రవర్తన పట్ల పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారి ఆదేశాల మేరకు మద్యం సేవించి కారు నడిపిన ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఎస్ఐ అమిత్ జైస్వాల్‌పై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని అన్నారు. ఆ ఎస్ఐ ప్రవర్తనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
In Lucknow, during New Year’s, a sub-inspector in civil dress drove his car onto the traffic barricading and got into an altercation with the DCP Traffic
The police arrested the sub-inspector and sent him to Hazratganj police station, bottles of alcohol were recovered from the… pic.twitter.com/ATz5cerm28
— Megh Updates 🚨™ (@MeghUpdates) January 1, 2026
Also Read:
Watch: న్యూఇయర్ వేడుకల్లో తాగి హంగామా చేసిన మహిళలు.. వీడియోలు వైరల్
Watch: యువతిని పట్టుకుని కత్తితో బెదిరించి డబ్బు డిమాండ్ చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: ఇంటి ముందు కూర్చొన్న వృద్ధురాలు.. కోతులు ఏం చేశాయంటే?