ప్రకటనల మాయాజాలం
గ్రేటర్ రోడ్లపై మెట్రో పరుగులు పెడుతున్నది కానీ.. ప్రకటనల పన్నులు ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం మాత్రం ప్రైవేట్ ఏజెన్సీలకే పరిమితమైంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ పర్యవేక్షణలో ఉన్న బడా యాడ్ ఏజెన్సీల నుంచి బల్దియాకు చెల్లించాల్సిన దాదాపు రూ.100 కోట్ల బకాయిల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అడ్వరె్టైజ్ మెంట్ ఫీజు పన్నులు బకాయిపడిన....
- రికవరీలో మీనమేషాలు
- బల్దియాకు మెట్రో బకాయి రూ.100 కోట్లు
- ప్రజల సొమ్ము ప్రైవేట్ ఏజెన్సీల ఖాతాల్లోకి
- ఏప్రిల్ నుంచి ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో
- ప్రకటన పన్ను వసూళ్లపై సందిగ్ధం
- సర్కారు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి
సిటీబ్యూరో, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ రోడ్లపై మెట్రో పరుగులు పెడుతున్నది కానీ.. ప్రకటనల పన్నులు ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం మాత్రం ప్రైవేట్ ఏజెన్సీలకే పరిమితమైంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ పర్యవేక్షణలో ఉన్న బడా యాడ్ ఏజెన్సీల నుంచి బల్దియాకు చెల్లించాల్సిన దాదాపు రూ.100 కోట్ల బకాయిల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అడ్వరె్టైజ్ మెంట్ ఫీజు పన్నులు బకాయిపడిన…. వాటిని వసూలు చేయడంలో జీహెచ్ఎంసీ అధికారులు మీనమేషాలు లెకించడం వెనుక పెద్ద మతలబు ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా మెట్రో పిల్లర్లు, స్టేషన్ల వద్ద ప్రదర్శించే ప్రకటనల ద్వారా ఎల్ అండ్ టీ సంస్థ ద్వారా ప్రకటనల రూపంలో యాడ్ ఏజెన్సీ ద్వారా కోట్లాది రూపాయల ఆదాయాన్ని గడిస్తున్నది. . నిబంధనల ప్రకారం ఇందులో జీహెచ్ఎంసీ వాటా (అడ్వర్టయిజ్మెంట్ ఫీజు/ పన్నులు ) చెల్లించాలి.
అయితే, 2018 మార్చి నుంచి ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా బల్దియా ఖజానాకు చేరలేదు. అధికారులు నోటీసులు ఇస్తున్నామని చెబుతున్నా, అవి కేవలం కాగితపు పులులకే పరిమితమవుతున్నాయే తప్ప అటు సంబంధిత యాడ్ ఏజెన్సీ నుంచి క్షేత్రస్థాయిలో రికవరీ జరగడం పోవడం తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రజాధనానికి గండి పడుతున్నా ఉన్నతాధికారులు మౌనం వహించడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? లేక ఏజెన్సీ ప్రతినిధులతో కుమ్మకయ్యారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బకాయిలు రికవరీ చేయకుండా రెన్యువల్ చేస్తే బల్దియాకు కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశమున్నది. ఈ మెట్రో బకాయిల గుట్టు ఎప్పుడు తేలుతుందో.. ప్రజల సొమ్ము ఎప్పుడు ఖజానాకు చేరుతుందో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ప్రభుత్వ నిర్ణయంపై ఆసక్తి
వచ్చే ఏప్రిల్ నెల నుంచి మెట్రో రైలు నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోనున్నది. ఒకవేళ ప్రభుత్వం మెట్రోను టేకోవర్ చేస్తే, పాత బకాయిల పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిర్వహణ ఖర్చులు, నష్టాలు వస్తున్నాయనే సాకుతో బకాయిల చెల్లింపును వాయిదా వేస్తూ, లోపాయికారి ఒప్పందాలతో సంబంధిత ఏజెన్సీలు వెళ్లేందుకు సెచ్ వేస్తున్నారా? అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించే లోపే ఈ 100కోట్ల రూపాయలను వసూలు చేస్తున్నదా? లేదా? అనే చర్చ జరుగుతున్నది. బకాయిలు క్లియర్ చేయకుండానే సంబంధిత కాంట్రాక్ట్ పొడిగిస్తారా? లేదా? రికవరీ చేసి కొత్త ఏజెన్సీకి మళ్లీ టెండర్లు పిలుస్తారా? అన్నది వేచి చూడాలి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

