Prabhas | రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ ఏడాదిలోనే ఓ సినిమాను విడుదల చేసిన ఆయన, మరో మూడు చిత్రాలను సెట్స్‌పైకి తీసుకెళ్లి తీరిక లేకుండా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. నిర్మాతలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రతి ప్రాజెక్ట్‌కు ప్రత్యేకంగా డేట్స్ కేటాయిస్తున్నారు. అయితే ఇలాంటి బిజీ షెడ్యూల్ మధ్య, టాలీవుడ్ సీనియర్ దర్శకులు వివి వినాయక్, మెహర్ రమేష్ ప్రభాస్‌ను కలవడం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించింది. గురువారం జరిగిన ఈ భేటీకి సంబంధించిన ఫోటోను మెహర్ రమేష్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “కలకాలం నిలిచే బంధాలు.. ఫ్రెండ్లీ టాక్స్.. స్వచ్ఛమైన ప్రేమ.. డియర్ బిగ్ బ్రదర్ వినాయక్.. డార్లింగ్ ప్రభాస్” అని క్యాప్షన్ పెట్టారు. ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రభాస్ గతంలో ఈ ఇద్దరు దర్శకులతో సినిమాలు చేశారు. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన యోగి కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించకపోయినా, నటుడిగా ప్రభాస్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా మదర్ సెంటిమెంట్‌ను హైలైట్ చేసిన ఆ చిత్రం ఆయనలోని ఎమోషనల్ నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేసింది. అదే విధంగా మెహర్ రమేష్ తెరకెక్కించిన బిల్లా చిత్రం ప్రభాస్‌ను స్టైలిష్ అవతార్‌లో అభిమానులకి పరిచయం చేసింది. ఆ చిత్రంలో ఆయన లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ ఇప్పటికీ అభిమానులకు ప్రత్యేకమే. సినిమా ఫలితం ఎలా ఉన్నా, ఈ ఇద్దరు దర్శకులతో ప్రభాస్‌కు వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉందని పలు సందర్భాల్లో వారు వెల్లడించారు.
ముగ్గురూ కలిసి ఆప్యాయంగా కౌగిలించుకున్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ భేటీ వెనుక ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఉందా? లేక స్నేహపూర్వక కలయిక మాత్రమేనా? అనే చర్చలు అభిమానుల్లో మొదలయ్యాయి. మెహర్, వినాయక్ ఇద్దరూ ఇటీవల సినిమాలు చేయకపోవడంతో, ప్రభాస్‌తో మరోసారి కలిసే అవకాశం ఉందా? అనే ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే, ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ‘స్పిరిట్’ చేస్తున్నారు. ఇటీవల నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘కల్కి 2’ కూడా సెట్స్‌పైకి వెళ్లింది. ప్రశాంత్ వర్మతో ఓ పా న్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నట్లు సమాచారం.