CITU Rally | కేంద్ర విధానాలను నిరసిస్తూ తాండూర్‌లో సీఐటీయూ ర్యాలీ, రాస్తారోకో
CITU Rally | కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, వ్యవసాయ విధానాలను నిరసిస్తూ సీఐటీయూ , వ్యవసాయ కార్మిక సంఘం తాండూర్‌లో జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించింది.
తాండూర్ : కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, వ్యవసాయ విధానాలను నిరసిస్తూ సీఐటీయూ( CITU ) , వ్యవసాయ కార్మిక సంఘం తాండూర్‌లో జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా నాయకులు, కార్మికులు ర్యాలీ ( Rally ) నిర్వహించి ఐబీ కూడలి వద్ద జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు.
అనంతరం సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దాగాం రాజారాం ( Dagam Rajaram ) మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసే విధంగా లేబర్ కోడ్లను అమలు చేస్తుందని విమర్శించారు. కార్మికుల పని గంటలను 8 నుంచి 12 గంటలకు పెంచేందుకు యాజమాన్యానికి హక్కు కల్పించడానికి యత్నిస్తుందని ఆరోపించారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఉపాధి హామీ చట్టాన్ని గత విధానంలోనే కొనసాగించాలని, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం తాండూర్ మండల అధ్యక్షుడు వేల్పుల శంకర్, నాయకులు బొల్లం రాజేశం,
జైనేని రాజయ్య, అంగన్వాడీ టీచర్లు లీలారాణి, సత్యవతి, కే విజయలక్ష్మి, ఎం విజయలక్ష్మి, శారద, లక్ష్మి, మగ్దూం, ఆశ కార్యకర్తలు, మధ్యాహ్న భోజన, వ్యవసాయ ,
సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

