Man Abusing Minors | మైనర్లను లైంగికంగా వేధిస్తున్న యువకుడు అరెస్ట్.. అతడి ఫోన్లో 600కు పైగా అసభ్యకర వీడియోలు
Man Abusing Minors | మైనర్లైన బాలబాలికలను ఒక వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నాడు. వారి వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. అతడి మొబైల్ ఫోన్లో 600కు పైగా అసభ్యకరమైన వీడియోలను గుర్తించారు.
ముంబై: మైనర్లైన బాలబాలికలను ఒక వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నాడు. వారి వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. అతడి మొబైల్ ఫోన్లో 600కు పైగా అసభ్యకరమైన వీడియోలను గుర్తించారు. (Man Abusing Minors) మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రైసింగ్పురాలో నివసించే 22 ఏళ్ల చేతన్ ప్రకాష్ కోలీ, గత కొన్నేళ్లుగా మైనర్ బాలికలు, బాలురను లైంగికంగా వేధిస్తున్నాడు. డబ్బు ఆశ చూపి వారిని ఆకర్షించి లైంగిక నేరాలకు పాల్పడుతున్నాడు. బాధితుల ఫొటోలు, వీడియోలు రికార్డ్ చేసి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించి వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. 2022 నుంచి మైనర్ బాలికలు, టీనేజ్ బాలురపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడు.
కాగా, చేతన్ ప్రకాష్ చాలా కాలంగా పిల్లలపై పాల్పడుతున్న లైంగిక వేధింపుల గురించి పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. చేతన్ మొబైల్ ఫోన్‌ను పోలీసులు పరిశీలించారు. 600కుపైగా అభస్యకర ఫొటోలు, వీడియోలు అందులో ఉండటం చూసి షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపారు. నిందితుడు చేతన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. బాధితులను సంప్రదించి వారి వాంగ్మూలాలు రికార్డ్ చేస్తామని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- abusing
- arrested
- Found
- Maharashtra
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

