Muslim Marriages | ముస్లిం వివాహాలకు షరియా చట్టమే వర్తిస్తుంది.. కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు
Muslim Marriages | ముస్లిం వివాహాల (Muslim Marriages) పై కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) సంచలన తీర్పు వెలువరించింది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ (Special Marriages Act) కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నా.. ముస్లిం వివాహాలకు షరియా చట్టమే (Shariat Act) వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది.
Muslim Marriages : ముస్లిం వివాహాల (Muslim Marriages) పై కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) సంచలన తీర్పు వెలువరించింది. స్పెషల్ మ్యారేజస్ యాక్ట్ (Special Marriages Act) కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నా.. ముస్లిం వివాహాలకు షరియా చట్టమే (Shariat Act) వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ డీకే సింగ్, జస్టిస్ టీఎమ్ నదాఫ్ ధర్మాసనం ‘సజీద్ పర్వేజ్ v/s ఫర్జానా తాజ్’ కేసులో ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను సమర్థిస్తూ ఈ తీర్పునిచ్చింది.
స్పెషల్ మ్యారేజస్ యాక్ట్ కింద విడాకులు కోరుతూ భర్త దాఖలు చేసిన పిటిషన్ చెల్లదని డివిజన్ బెంచ్ స్పష్టంచేసింది. ‘నికాహ్’ను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద నమోదు చేసినంత మాత్రాన వివాహ మూల స్వభావం మారదని పేర్కొన్నది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం జరిగిన పెళ్లిళ్లకు షరియా చట్టమే వర్తిస్తుందని తెలిపింది. విదేశీ ప్రయాణాలు/వీసా కోసం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద పెళ్లి రిజిస్టర్ చేసుకున్నంత మాత్రాన ముస్లిం పర్సనల్ లా రద్దు కాదని తేల్చిచెప్పింది.
‘నికాహ్’ చేసుకున్న దంపతులు విడాకుల కోసం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్‌ను ఆశ్రయించలేరని వెల్లడించింది. వ్యక్తిగత చట్టాల ప్రకారం జరిగిన వివాహాలకు ఆయా మతపరమైన నిబంధనలే వర్తిస్తాయని హైకోర్టు డివిజన్ బెంచ్ తెలిపింది. స్పెషల్ మ్యారేజస్ యాక్ట్ కింద విడాకులు పొందాలంటే.. వివాహం కూడా అదే చట్టం కింద జరిగి ఉండటం తప్పనిసరని పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

