జైపూర్: వివాహిత మహిళతో ఒక యువకుడు ఫోన్లో మాట్లాడాడు. ఇది తెలుసుకున్న ఆమె సోదరులు అతడిపై ఆగ్రహించారు. న్యూఇయర్ పార్టీ పేరుతో ఆ యువకుడిని తీసుకెళ్లారు. అతడ్ని కొట్టి చంపారు. (Man Beaten To Death) రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హనుమాన్‌గఢ్‌కు చెందిన 22 ఏళ్ల పలారామ్ ఒక వివాహిత మహిళతో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఈ విషయం ఆమె సోదరులకు తెలిసింది. దీంతో సోదరితో ఆ యువకుడు మాట్లాడటంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.
కాగా, డిసెంబర్ 31న రాత్రి వేళ న్యూఇయర్ పార్టీ పేరుతో ఆ మహిళ ముగ్గురు సోదరులు, వారి స్నేహితులు కలిసి పలారామ్ను బయటకు తీసుకెళ్లారు. అతడితో మద్యం తాగించారు. మత్తులో ఉన్న ఆ యువకుడిని పైపులతో దారుణంగా కొట్టారు.
మరోవైపు పలారామ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించేందుకు ఆ వ్యక్తులు ప్రయత్నించారు. అయితే మార్గమధ్యలో అతడు మరణించాడు. ఈ నేపథ్యంలో హైవే సమీపంలో పార్క్ చేసిన కారులో పలారామ్ మృతదేహాన్ని వదిలేసి పారిపోయారు.
కాగా, గురువారం ఉదయం కారులో మృతదేహాన్ని గమనించిన కొందరు వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడ్ని పలారామ్గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలతో నిందితులను పోలీసులు గుర్తించారు. మహిళ ముగ్గురు సోదరులను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Parrots Die Of Food Poisoning | ఫుడ్ పాయిజనింగ్ వల్ల.. 200 చిలుకలు మృతి
Watch: మొబైల్ ఫోన్‌తో వ్యక్తిని స్కాన్ చేసిన పోలీస్.. బంగ్లాదేశీయుడో కాదో గుర్తిస్తుందని వెల్లడి
Watch: యువతిని పట్టుకుని కత్తితో బెదిరించి డబ్బు డిమాండ్ చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?