Mohammad Pakpour | ఇరాన్‌కు ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ ఐఆర్జీసీ చీఫ్ మొహమ్మద్ పాక్పోర్ హతం
Mohammad Pakpour : ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌కు చెందిన ఐఆర్జీసీ (ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్) చీఫ్ కమాండర్ మొహమ్మద్ పాక్పోర్ హతమయ్యాడు.
Mohammad Pakpour : ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌కు చెందిన ఐఆర్జీసీ (ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్) చీఫ్ కమాండర్ మొహమ్మద్ పాక్పోర్ హతమయ్యాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. అయితే, అతడి మరణాన్ని ఇరాన్ ఇంకా ధృవీకరించలేదు. పాక్పోర్ ఇరాన్లో కీలక నేత. ఆయన ఐఆర్‌జీసీకి 260 రోజులుగా నాయకత్వం వహిస్తున్నాడు. అంతకుముందు అతడు మేజర్ జనరల్‌గా ఉండేవారు.
గతేడాది అతడిని ఐఆర్జీసీ చీఫ్‌గా నియమిస్తూ ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ 2025లో ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు ఈ స్థానంలో ఉన్న హుసేన్ సలామి కొనసాగాడు. హుసేన్ మరణం తర్వాత పాక్పోర్ బాధ్యతలు తీసుకున్నాడు. ఐఆర్జీసీ బలోపేతమే లక్ష్యంగా అతడు పని చేశాడు. గత నెలలో పాక్పోర్.. అమెరికా, ఇజ్రాయెల్‌కు సంయుక్తంగా హెచ్చరికలు జారీ చేశాడు. తమను తక్కువగా అంచనా వేయొద్దని, గతంలోకంటే ఇప్పుడు తమ దేశం ఇంకా బలంగా ఉందన్నాడు. అయితే, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనిని టార్గెట్ చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. కానీ, ఆయన ఈ దాడి నుంచి బయటపడ్డారు. దాడి సమయంలో ఖమేనీ ఆయన నివాసం వద్ద లేరని ఇజ్రాయెల్ తెలిపింది. ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో ఆయన రహస్య ప్రాంతంలో ఉన్నారు. మరోవైపు తాజా దాడులపై ఇరాన్ స్పందించింది. తాము ఇప్పటివరకు పనికిరాని మిస్సైల్స్ మాత్రమే ప్రయోగించామని, నిజమైన, ఊహకందని మిస్సైల్స్ ప్రయోగిస్తే అమెరికా తట్టుకోలేదని హెచ్చరించింది.
మరోవైపు అమెరికాకు ఆశ్రయం ఇచ్చిన గల్ఫ్‌లోని నౌక, వైమానిక స్థావరాలపై ఇరాన్ మిస్సైల్ దాడులు చేసింది. ఇరాన్‌కు కీలకంగా ఉన్న చాబహార్ పోర్టుపై కూడా దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో దాడులకు సంబంధించిన శబ్దాలు విన్నట్లు స్తానికులు తెలిపారు. కానీ, అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన మిస్సైల్ దాడికి సంబంధించిన వీడియోను ఆ దేశం విడుదల చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

