ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఒక మహిళ గతంలో విమర్శించిన వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. దీంతో ఆ పార్టీ కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో పూణే పౌర ఎన్నికల్లో ఆ మహిళ అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఉపసంహరించుకున్నది. (BJP Drops Pune Candidate) పూణే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ), బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. వార్డ్ నంబర్ 2 అభ్యర్థిగా ఆర్పీఐకు చెందిన పూజా మోర్ జాదవ్‌కు ఏబీ ఫారాన్ని బీజేపీ ఇచ్చింది. దీంతో ఆమె నామినేషన్ దాఖలు చేశారు.
కాగా, మరాఠా కోటా ఆందోళన సందర్భంగా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను పూజా జాదవ్ విమర్శించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆమెకు బీజేపీ ఫారం ఇవ్వడంపై ఆ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఆమె నామినేషన్‌ను బీజేపీ ఉపసంహరించుకున్నది. కేంద్ర మంత్రి, పూణే బీజేపీ ఎంపీ మురళీధర్ మోహోల్ దీనిని ధృవీకరించారు.
మరోవైపు సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల తాను నష్టపోయినట్లు పూజా జాదవ్ వాపోయింది. ‘వారు నా గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారు. బీజేపీ సిద్ధాంతాన్ని నేను నమ్మనని చిత్రీకరించడానికి ప్రయత్నించారు. ఫడ్నవీస్ గురించి వ్యాఖలు చేసింది వేరే అమ్మాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్‌ను నాకు ఆపాదించారు. అందుకే నామినేషన్ ఉపసంహరించుకున్నా’ అని ఆమె అన్నారు.
Also Read:
Man Beaten To Death | వివాహిత మహిళతో మాట్లాడినందుకు.. యువకుడిని కొట్టి చంపారు
Parrots Die Of Food Poisoning | ఫుడ్ పాయిజనింగ్ వల్ల.. 200 చిలుకలు మృతి
Watch: మొబైల్ ఫోన్‌తో వ్యక్తిని స్కాన్ చేసిన పోలీస్.. బంగ్లాదేశీయుడో కాదో గుర్తిస్తుందని వెల్లడి