SL vs PAK : సెమీస్ బెర్తుపై కన్నేసిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు శుభారంభిచ్చారు. భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌లో ఓపెనర్ ఫర్హాన్(40 నాటౌట్) చెలరేగుతున్నాడు. చమీర వేసిన తొలి ఓవర్లోనే బౌండరీ రాబట్టాడు. మధుషనక ఓవర్లో రెచ్చిపోయిన అతడు.. 4, 6తో రెచ్చిపోయాడు.
మరో ఎండ్‌లో ఫఖర్ జమాన్(23 నాటౌట్) సైతం దంచేస్తున్నాడు. శ్రీలంక కెప్టెన్ దసున్ శనకు చుక్కలు చూపిస్తూ.. వరుసగా రెండు ఫోర్లు బాదాడు. ఫర్హాన్ బౌండరీ కొట్టగా ఆ ఓవర్లో 13 రన్స్ పిండుకున్నారు. వీరిద్దరి విధ్వంసంతో పవర్ ప్లేలో పాక్ వికెట్ కోల్పోకుండా 64 రన్స్ చేసింది.