టీఏజీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కమిటీ
తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా గౌరీ నాగేశ్వరరావు, కారం పుల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ములకలపల్లి మండలం రాయల ఫంక్షన్ హాల్లో జరిగిన తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా మూడవ మహాసభలో...
– అధ్యక్ష కార్యదర్శులుగా గౌరీ నాగేశ్వరరావు, కారం పుల్లయ్య ఏకగ్రీవ ఎన్నిక
ములకలపల్లి, నవంబర్ 24 : తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా గౌరీ నాగేశ్వరరావు, కారం పుల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ములకలపల్లి మండలం రాయల ఫంక్షన్ హాల్లో జరిగిన తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా మూడవ మహాసభలో 35 మందితో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మరో 15 మందిని ఆఫీస్ బేరర్ గా ఎన్నుకున్నారు. అనంతరం అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. తమ మీద నమ్మకంతో రెండోసారి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నిక చేసిన రాష్ట్ర కమిటీకి, జిల్లా నూతన కమిటీకి, మహాసభలో హాజరైన ప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆదివాసీ సమస్యలు పరిష్కారం కోసం పని చేస్తామని తెలిపారు. 1/70 చట్టాన్ని పకడ్భందీగా అమలు చేయాలని, జీవో నెంబర్ 3ని ఆర్డినెన్స్ ద్వారా పునరుద్ధరణ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వారు డిమాండ్ చేశారు.
ఐదవ షెడ్యూలు భూభాగంలో సర్వ హక్కులు ఆదివాసిలకే చెందాలన్నారు. ఆటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 ప్రకారం సాగు చేస్తున్న ప్రతి ఆదివాసి కుటుంబానికి పది ఎకరాల భూమి ఇవ్వాలన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో అన్ని ఐటీడీఏ పరిధిలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులన్నీ ఆదివాసీలతోనే నింపాలని, అదేవిధంగా ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీని వెంటనే నిర్వహించి ఆదివాసీ నిరుద్యోగుల సమస్యను పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. లేదంటే రానున్న కాలంలో ఆదివాసిని కదిలించి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని కేంద్ర, రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరించారు. ఉపాధ్యక్షులుగా సరియం కోటేశ్వరరావు, పాయం నరసింహారావు, దుబ్బా గోవర్ధన్, సోడెం ప్రసాద్, మడి నరసింహారావు, వీళ్లతో పాటు సహాయ కార్యదర్శులుగా సున్నం గంగా, మడివి రమేశ్, కారం నరేశ్, కొమరం కాంతారావు, మడి సురేశ్, కోశాధికారిగా సోయం జోగారావు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టీఏజీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కమిటీ
RS Praveen Kumar | హైదరాబాద్‌లో టెర్రర్ అటాక్స్ ఉన్నాయనే కాన్ఫిడెన్షియల్ మెసేజ్ సోషల్ మీడియాలోకి ఎలా వెళ్లింది?
Sheikh Hasina | చేతులకు సంకెళ్లతో మాత్రమే స్వదేశానికి షేక్ హసీనా : బంగ్లాదేశ్
Boat Missing | ఏడుగురు మత్స్యకారుల బోటు గల్లంతు..కుటుంబ సభ్యుల్లో ఆందోళన
Dhanush | 2027 స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ధనుష్ వ్యూహం.. రాష్ట్రవ్యాప్తంగా సేవా విభాగాల బలోపేతం
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

